AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravindra Jadeja: అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుజరాతీ ఓటర్లకు బాల్ సాహెబ్ ఠాక్రే సందేశం.. ట్వీట్ చేసిన సీనియర్ క్రికెటర్..

భారత క్రికెట్ అల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రీవాబా జడేజా గుజరాత్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో.. జడేజా ఓ ట్వీట్‌ చేశాడు.  అదేమిటంటే మహారాష్ట్రలోని శివసేన  స్థాపకుడు, మరాఠా సింహంగా ప్రసిద్ధి పొందిన బాల్ సాహెబ్ ఠాక్రే..

Ravindra Jadeja: అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుజరాతీ ఓటర్లకు బాల్ సాహెబ్ ఠాక్రే సందేశం.. ట్వీట్ చేసిన సీనియర్ క్రికెటర్..
Jadeja And Thakrey
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 01, 2022 | 12:23 PM

Share

భారత క్రికెట్ అల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రీవాబా జడేజా గుజరాత్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో.. జడేజా ఓ ట్వీట్‌ చేశాడు.  అదేమిటంటే మహారాష్ట్రలోని శివసేన  స్థాపకుడు, మరాఠా ఆరాధ్యదైవంగా ప్రసిద్ధి పొందిన బాల్ సాహెబ్ ఠాక్రే పాత వీడియో. తన భార్య అభ్యర్థిగా ఉన్న జామ్ నగర్ నార్త్ అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు అంటే గురువారం జరుతున్నాయి. అయితే ఎన్నిక జరగడానికి సరిగా ముందు రోజు జడేజా చేసిన  ఈ ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలలో తన భార్య పోటీ చేయనుండడంతో  జడేజా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. అదే క్రమంలో బుధవారం రాత్రి జడేజా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో దివంగత బాల్ ఠాక్రే మాట్లాడుతూ ‘‘ మోదీ లేకపోతే గుజరాత్ లేనట్లే’’ అని అన్నారు. ఈ పాత వీడియోను జడేజా పోస్ట్ చేయడమే కాక..‘‘ ఇంకా సమయం ఉంది గుజరాతీయులారా.. అర్థం చేసుకోండి’’ అని కాప్షన్ రాసుకోచ్చాడు.

ఈ వీడియోలో ఏముంది..?

రవీంద్ర జడేజా తన ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసినది బాలాసాహెబ్ ఠాక్రే పాత వీడియో. అందులో బాలా సాహెబ్ ‘‘నేను చెప్పాల్సిందల్లా.. నరేంద్ర మోడీ పోతే గుజరాత్ పోతుంది’’ అని   అన్నారు. అలాగే, గుజరాతీలు అర్థం చేసుకునే సమయం ఆసన్నమైందని జడేజా ఈ పోస్ట్‌లో రాశారు.

ఇవి కూడా చదవండి

కాగా, రివాబా బీజేపీ తరఫున పోటీ  చేస్తుండడంతో.. రవీంద్ర జడేజా తన భార్య వెంట ఎన్నికల ప్రచారం చేశారు. మరోవైపు అతని సోదరి నయనబా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆమె, కాంగ్రెస్ కోసంజడేజా తండ్రి  ప్రచారం చేయడం గమనార్హం.

 గుజరాత్‌లో గురువారం మొదటి దశ ఓటింగ్..

గుజరాత్‌లోని 19 జిల్లాల్లోని 89 స్థానాలకు ఈ రోజు (గురువారం) ఓటింగ్ ప్రారంభమైంది. డిసెంబర్ 1వ గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఈ ఓటింగ్ జరగనుంది.  తొలి దశ ఎన్నికల్లో మొత్తం 788 మంది అభ్యర్థులు పోటీచేశారు. మొత్తం 39 రాజకీయ పార్టీల మధ్య ఈ పోరు నెలకొంది. ఇందులో 2 కోట్ల 39 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. తొలిదశలో 6 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, 25,430 పోలింగ్ బూత్‌లలో ఎన్నిక  జరగునుంది. అయితే ఈ ఎన్నికల కోసం మొత్తం 34,324 ఈవీఎంలు, 38,749 వీవీప్యాట్ మెషీన్లను ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 1 లక్షా 6 వేల 963 మంది సిబ్బందిని ఓటింగ్ కోసం వినియోగిస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద వెబ్ కాస్టింగ్ కోసం ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..