AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: నేడు అహ్మదాబాద్ లో ప్రధాని రోడ్ షో.. క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా..

ఓ వైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ గ్రాండ్ రోడ్ షో.. రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. ప్రధానిఅహ్మదాబాద్‌తో పాటు సూరత్‌లో ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు....

PM Modi: నేడు అహ్మదాబాద్ లో ప్రధాని రోడ్ షో.. క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా..
Pm Modi
Ganesh Mudavath
|

Updated on: Dec 01, 2022 | 12:27 PM

Share

ఓ వైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ గ్రాండ్ రోడ్ షో.. రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. ప్రధానిఅహ్మదాబాద్‌తో పాటు సూరత్‌లో ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు భారీగా రోడ్ షో చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇవాళ (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. నరోడా నుంచి చంద్‌ఖేడా వరకు రోడ్ షో లో పాల్గొననున్నారు. అహ్మదాబాద్ నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాని రోడ్ షో రూట్‌ను సిద్ధం చేశారు. ప్రధాని మోదీ తొలిసారిగా 30 కిలోమీటర్ల రోడ్ షో లో అటెండ్ అవనున్నారు. అహ్మదాబాద్‌లోని అన్ని స్థానాలకు రెండో దశలో ఓటింగ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని అన్ని సీట్లను కవర్ చేస్తూ గ్రాండ్ రోడ్ షో నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రధాని భద్రతకు జాగ్రత్తలు తీసుకున్నారు.

నరోడా గ్రామం- నరోడా పాటియా సర్కిల్ – కృష్ణానగర్ చార్ రాస్తా హిరావాడి – సుహానా రెస్టారెంట్- శ్యామ్ శిఖర్ చార్ రాస్తా – బాపునగర్ చార్ రాస్తా – ఖోడియార్‌ నగర్ – బీఆర్టీఎస్ రూట్ విరాట్‌నగర్ – సోని చలి – రాజేంద్ర చార్ రాస్తా – రాబరీ కాలనీ – సీటీఎం – ఖోఖరా సర్కిల్- అనుపమ్ బ్రిడ్జి – పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహం- ఫుట్‌బాల్ గ్రౌండ్- భూలాభాయ్ చార్ రాస్తా – చంద్రానగర్- ధరణివరాజ్ చార్ రాస్తా – శ్యామల్ – శివరంజని – హెల్మెట్ నాలుగు రోడ్లు, ఏఈసీ AEC నాలుగు రోడ్లు – పల్లవ్ – ప్రభాత్ చౌక్ – పటీదార్ చౌక్ అఖ్బర్ నగర్ – వ్యాస్వాడి – డి మార్ట్ – ఆర్టీఓ సర్కిల్ సబర్మతి పవర్ హౌస్ – సబర్మతి పోలీస్ స్టేషన్ – విశాత్ నగర్ – చంద్‌ఖేడాకు ఐఓసీ లో రోడ్ షో సాగనుంది.

మరోవైపు.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మొదటి దశ పోలింగ్ స్టార్ట్ అయింది. 89 నియోజకవర్గాలలో పోలింగ్‌ జరగుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రంగా 27 సంవత్సరాలుగా ఉన్న గుజదాత్‌ను తమ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 14,382 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ), సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ), భారతీయ గిరిజన పార్టీ (బీటీపీ) సహా 36 ఇతర పార్టీలు పోటీ చేశాయి. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మొత్తం 89 స్థానాలలోనూ పోటీ చేయనుండగా ఆమ్ ఆద్మీ పార్టీ 88 స్థానాలలోనే బరిలోకి దిగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..