Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Safety Tips for UPI: డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడుతున్నారా..? అయితే తప్పక పాటించవలసిన జాగ్రత్తలు మీ కోసం..

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)తో కలిసి యూపీఐ డిజిటల్ పేమెంట్స్ విభాగంలో పరిమితులు విధించాలని ప్రయత్నిస్తోంది. గూగుల్ పే, పేటిమ్, ఫోన్‍పే లాంటి థర్డ్‌పార్టీ ప్రవేట్ కంపెనీల యాప్స్ నుంచే ఎక్కువశాతం యూపీఐ లావాదేవీలే జరుగుతుండడంతో..

Safety Tips for UPI: డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడుతున్నారా..? అయితే తప్పక పాటించవలసిన జాగ్రత్తలు మీ కోసం..
Upi Apps
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 01, 2022 | 9:24 AM

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)తో కలిసి యూపీఐ డిజిటల్ పేమెంట్స్ విభాగంలో పరిమితులు విధించాలని ప్రయత్నిస్తోంది. గూగుల్ పే, పేటిమ్, ఫోన్‍పే లాంటి థర్డ్‌పార్టీ ప్రవేట్ కంపెనీల యాప్స్ నుంచే ఎక్కువశాతం యూపీఐ లావాదేవీలే జరుగుతుండడంతో, వాటినుంచి లావాదేవీలు 30% మించి రాకూడదన్న నియమాలపై కసరత్తులు జరుగుతున్నాయి. ఇవిగానీ అమలులోకి వస్తే డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడకంలో మార్పులు వస్తాయి. బహుశా, నెలకు నిర్ణయించిన లావాదేవీలు కన్నా ఎక్కువ చేయకూడదన్న నియమాలు రావచ్చు. ఇంకా యూపీఐ లావాదేవీలలో జరుగుతున్న సైబర్ మోసాలను మనం చూస్తూనే ఉన్నాం.

ఆ నేపథ్యంలో ఈ యాప్స్ విషయాల్లో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు..

మొబైల్ పేమెంట్ యాప్స్

నెట్ బ్యాంకింగ్ లాంటివి వాడి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి.. అవతలివారి బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ తెలుసుండాలి. అప్పుడు గానీ డబ్బు పంపలేం. కానీ ఈ బాధలేవీ లేకుండా ఒక ఫోన్ నెంబర్ ఉంటే చాలు, ఎవరికైనా డబ్బులు పంపించే వెసులుబాటు ఇచ్చే టెక్నాలజీ Unified Payments Interface (UPI). గూగుల్ పే, పేటిఎమ్, ఫోన్ పే, వాట్సాప్ పే వంటివి డిజిటల్ పేమెంట్‌కు ఈ సేవలను అందిస్తున్నాయి. వీటి వల్ల ఎన్ని సౌలభ్యాలు ఉన్నాయో, వీటిని జాగ్రత్తను ఉపయోగించకపోతే డబ్బు నష్టపోయే అవకాశాలూ అంతే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మార్కెట్‍లో ఎడాపెడా కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. వీటిలో ఏవి నమ్మదగినవో, వేటికి దూరంగా ఉండాలో తెల్సుకోవడం కూడా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

ఆ క్రమంలో మనకి ఉపయోగపడే కొన్ని ప్రశ్నలు:

  • ప్లే స్టోర్/యాప్ స్టోర్‌లో ఈ యాప్‍కు సరైన రేటింగ్స్, రివ్యూస్ ఉన్నాయా..?
  • యాప్ వాడడానికి లాగిన్ అవ్వాలి కదా. ఆ లాగిన్ నియమాలు ఎంత పకడ్బందీగా ఉన్నాయి..? పాస్‍వర్డ్‌ను సెట్ చేసుకోనిస్తుందా?
  • ఫోన్ తెరిచేటప్పుడు ఇచ్చే పాస్‍వర్డ్ కాకుండా, యాప్ తెరవడానికి కూడా మళ్ళీ పాస్‍వర్డ్ లాంటివి అడుగుతుందా?
  • యాప్ నుంచి డబ్బులు వేళ్లినా, డబ్బులు వచ్చినా నోటిఫికేషన్స్ వస్తున్నాయా?
  • పొరపాటున వేయకూడని వారికి డబ్బులు వేస్తే సరిజేసుకునే అవకాశాలు ఇస్తుందా? పేమెంట్ చేసే ముందు, కన్‍ఫర్మేషన్ అడుగుతుందా?
  • యాప్ ఇన్‍స్టాల్ చేసేటప్పుడు ఏయే పర్మిషన్లు అడుగుతుంది? థర్డ్ పార్టీ కంపెనీలకు డేటా పంపించే అవకాశాలు ఉన్నట్టు యాప్ వివరాల్లో ఎక్కడన్నా ఉందా?

యాప్‍ను సురక్షితం చేసుకోడం ఎలా..?

మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ (Multi-Factor Authentication – MFA): దీనిని ఎనేబుల్ చేసుకోవడం వల్ల కేవలం యూజర్ నేమ్/పాస్ వర్డ్ అడిగి ఊరుకోకుండా, అవి ఇచ్చాక మళ్ళీ మొబైల్/ఈమెయిల్‍కు ఓటీపీ పంపిస్తుంది. ఓటీపీ కరెక్టుగా ఎంటర్ చేస్తేనే యాప్‍లో వివరాలు చూపిస్తుంది. అందుకని ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాలి.

నోటిఫికేషన్లు: మన అకౌంట్‍లో డబ్బులు పడినా, లేక తీసినా నోటిఫికేషన్లు వచ్చేలా సెట్టింగ్ పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల మనకు తెలీకుండా డబ్బులు కట్ అయినప్పుడు కూడా మనకి వెంటనే తెలుస్తుంది. మొబైల్ నోటిఫికేషన్లతో పాటు SMS/Email నోటిఫికేషన్లు కూడా పెట్టుకోవచ్చు.

పాస్‍కోడ్: మామూలుగా మన ఫోన్ పాస్‍కోడ్/పాస్‍వర్డ్ ఇచ్చాక అన్ని యాప్స్ అందుబాటులో ఉంటాయి. కానీ, యాప్ ఓపెన్ చేయాల్సిన ప్రతిసారి పాస్‍కోడ్ ఇచ్చేలా సెట్టింగ్ పెట్టుకుంటే అధిక భద్రత ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..