AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cristiano Ronaldo: ఎందుకీ కష్టం బ్రో.. క్రిస్టియానో రొనాల్డోను కాపీ కొట్టబోయాడు.. కట్ చేస్తే..

రొనాల్డొ వీరాభిమాని అయిన ఒకతను సుయ్‌ సిగ్నేచర్‌ స్టెప్‌ను కాపీ కొట్టాలని ప్రయత్నించాడు. కానీ కట్‌చేస్తే ఇప్పుడు ఆస్పత్రి బెడ్‌పై పేషెంట్‌లా పడి ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Cristiano Ronaldo: ఎందుకీ కష్టం బ్రో.. క్రిస్టియానో రొనాల్డోను కాపీ కొట్టబోయాడు.. కట్ చేస్తే..
Cristiano Ronaldo Fan
Basha Shek
|

Updated on: Oct 01, 2022 | 7:27 AM

Share

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌, పాపులారిటీ ఉంది. అతని ఆటతో పాటు వ్యక్తిత్వానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో గోల్‌ కొట్టినప్పుడల్లా రొనాల్డ్‌ వేసే ఒక సిగ్నెచర్‌ స్టెప్‌కు ఎంతోమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అదే సుయ్‌ అనే సెలబ్రేషన్‌. ఇదెలా ఉంటుందంటే.. గోల్‌ కొట్టిన తర్వాత అమాంతం గాల్లోకి ఎగిరి ఆ తర్వాత వెనక్కి తిరిగి సుయ్‌ అని గట్టిగా అరవడమే. ఇలా రొనాల్డొ సుయ్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. ఈనేపథ్యంలో రొనాల్డొ వీరాభిమాని అయిన ఒకతను సుయ్‌ సిగ్నేచర్‌ స్టెప్‌ను కాపీ కొట్టాలని ప్రయత్నించాడు. కానీ కట్‌చేస్తే ఇప్పుడు ఆస్పత్రి బెడ్‌పై పేషెంట్‌లా పడి ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. సరదాగా జరిగిన ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా రొనాల్డో అభిమాని బంతిని విజయవంతంగా గోల్‌పోస్ట్‌కు తరలించాడు. ఆ తర్వాత రొనాల్డోను ఇమిటేట్‌ చేయడానికి ట్రై చేశాడు. కానీ దురదృష్టం వెంటాడింది. బ్యాలెన్స్‌ తప్పిపోయి కిందపడ్డాడు. ఈ సమయంలో బరువంతా అతని ఎడమ కాలుపై పడడంతో లేవడానికి తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఇది చూసిన తోటి స్నేహితులు ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పించారు. కాగా చికిత్స సందర్భంగా ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఆ వ్యక్తి చేతిలో పిజ్జా, బీర్‌ కనిపించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

ఎందుకీ కష్టం బ్రో! దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎంత అభిమానం ఉన్నా మనకు రాని పనులు ట్రై చేయకూడదు భయ్యా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా క్రిస్టియానో 2013లో చెల్సియాతో జరిగిన మ్యాచ్‌లో తొలిసారిగా సుయ్‌ అనే పదాన్ని ఉపయోగించాడు. అప్పటినుంచి అది రొనాల్డో సుయ్‌ ట్రేడ్‌ మార్క్ సెలబ్రేషన్‌ బాగా పాపులర్‌ అయింది. కొన్ని రోజుల క్రితం టీమిండియా క్రికెటర్‌, హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కూడా రొనాల్డోలాగే సుయ్‌ సెలబ్రేషన్‌ చేయడం వైరల్‌గా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి.. పొలాల్లో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే
ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి.. పొలాల్లో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
పెళ్లి తప్పనిసరా? గరుడ పురాణం షాకింగ్ సమాధానం!
పెళ్లి తప్పనిసరా? గరుడ పురాణం షాకింగ్ సమాధానం!
మే నెలలో అదృష్టం కలిసి వచ్చే రాశులు ఇవే.. మీ రాశి ఉందా మరి!
మే నెలలో అదృష్టం కలిసి వచ్చే రాశులు ఇవే.. మీ రాశి ఉందా మరి!
చంపకుండా మీ కిచెన్‌లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా?
చంపకుండా మీ కిచెన్‌లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా?
టాక్సిక్ సినిమాలో అలాంటి సీన్స్.. డైరెక్టర్ పై యశ్ ప్రశంసలు..
టాక్సిక్ సినిమాలో అలాంటి సీన్స్.. డైరెక్టర్ పై యశ్ ప్రశంసలు..
మీ ఫోన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలా.. వారానికి ఒక్క నిమిషం ఇలా..
మీ ఫోన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలా.. వారానికి ఒక్క నిమిషం ఇలా..
వేసవిలో వేధించే వేడి దద్దుర్లు.. ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న అ
వేసవిలో వేధించే వేడి దద్దుర్లు.. ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న అ