CWG 2022: బర్మింగ్‌హామ్‌లో యువ భారత్‌ సత్తా.. కామన్వెల్త్‌లో మెరిసిన నయా స్టార్లు ఎవరంటే?

Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 61 పతకాలు సొంతం చేసుకుంది. ఇందులో 22 బంగారు పతకాలు, 15 రజతాలు, 23 కాంస్యాలు ఉన్నాయి. గత కామన్వెల్త్‌ గేమ్స్‌ కంటే ఈసారి పతకాల తగ్గినా..

CWG 2022: బర్మింగ్‌హామ్‌లో యువ భారత్‌ సత్తా.. కామన్వెల్త్‌లో మెరిసిన నయా స్టార్లు ఎవరంటే?
Cwg 2022
Follow us
Basha Shek

|

Updated on: Aug 09, 2022 | 8:37 AM

Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 61 పతకాలు సొంతం చేసుకుంది. ఇందులో 22 బంగారు పతకాలు, 15 రజతాలు, 23 కాంస్యాలు ఉన్నాయి. గత కామన్వెల్త్‌ గేమ్స్‌ కంటే ఈసారి పతకాల సంఖ్య తగ్గినా బర్మింగ్‌హామ్‌లో యువ క్రీడాకారులు సత్తాచాటారు. మొదటిసారి ప్రతిష్ఠాత్మక క్రీడల్లో పాల్గొన్నప్పటికీ ఎలాంటి బెరుకులేకుండా పతకాలు కొల్లగొట్టారు. తద్వారా భవిష్యత్‌పై ఆశలు కల్పించారు. మరి ఈ కామన్వెల్త్‌ క్రీడల్లో మెరిసిన నయా స్టార్లపై లుక్కేద్దాం రండి.

ఇవి కూడా చదవండి
  • పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో అవినాష్ సాబ్లే రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అతను 3వేల మీటర్ల రేసును 8:11.20 నిమిషాల్లో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఇది అవినాష్ సాబ్లే వ్యక్తిగత అత్యుత్తమంతో పాటు..జాతీయ రికార్డు కావడం విశేషం.
  • పురుషుల హైజంప్ ఈవెంట్‌లో తేజస్విన్ శంకర్ ఈసారి కాంస్య పతకాన్ని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తద్వారా కామన్వెల్త్‌ గేమ్స్‌ హైజంప్‌ విభాగంలో దేశానికి పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా రికార్డుల్లో నిలిచాడు. హైజంప్‌ ఫైనల్స్‌లో శంకర్‌ 2.22 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు.
  • ట్రిపుల్ జంప్ కూడా ఈసారి ఇద్దరు భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. ఆల్డోస్ పాల్ స్వర్ణం సాధించిన ఆరో భారత అథ్లెట్‌గా నిలిచాడు. అదేవిధంగా కేరళకు చెందిన అబ్దుల్లా అబూబకర్ కూడా ఈ ఈవెంట్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.
  • 10,000 మీటర్ల రేస్ వాక్ ఈవెంట్‌లో ప్రియాంక గోస్వామి రజత పతకాన్ని గెలుచుకుంది. రేస్‌వాక్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా కొత్త చరిత్ర సృష్టించింది.
  • లాన్ బాల్స్‌లో భారత మహిళల జట్టు చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. లవ్లీ చౌబే (లీడ్), పింకీ (ద్వితీయ), నయన్మోని సైకియా (తృతీయ), రూపా రాణి టిర్కీ (స్లిప్)లతో కూడిన భారత క్వార్టెట్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. అదే సమయంలో పురుషుల జట్టు కూడా రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రీడలో భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి.
  • మహిళల 71 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ హర్జిందర్ కౌర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. హర్జిందర్ స్నాచ్‌లో 93 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 119 కిలోలు ఎత్తి మొత్తం 212 కిలోల బరువుతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. హర్జీందర్ కౌర్ కామన్వెల్త్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి.
  • ఈసారి టేబుల్ టెన్నిస్‌లో భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బాత్రా ఫ్లాప్ అయినప్పటికీ శ్రీజ ఆకుల రూపంలో భారత్‌కు కొత్త స్టార్ వెలుగులోకి వచ్చింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో, ఆమె అచంట్ శరత్ కమల్‌తో కలిసి చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని స్వర్ణం సొంతం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..