CWG 2022: బర్మింగ్‌హామ్‌లో భారత్‌ జోరు.. అర్ధసెంచరీ దాటిన పతకాలు.. నేటి ఆసక్తికర మ్యాచ్‌లేంటంటే?

Commonwealth Games2022: బర్మింగ్‌ హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022 తుది అంకానికి చేరుకున్నాయి. నేటితో ఈ ప్రతిష్ఠాత్మక గేమ్స్‌ ముగియనున్నాయి.

CWG 2022: బర్మింగ్‌హామ్‌లో భారత్‌ జోరు.. అర్ధసెంచరీ దాటిన పతకాలు.. నేటి ఆసక్తికర మ్యాచ్‌లేంటంటే?
Pv Sindhu
Follow us
Basha Shek

|

Updated on: Aug 08, 2022 | 7:46 AM

Commonwealth Games2022: బర్మింగ్‌ హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022 తుది అంకానికి చేరుకున్నాయి. నేటితో ఈ ప్రతిష్ఠాత్మక గేమ్స్‌ ముగియనున్నాయి. ఇక ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం17 బంగారు పతకాలతో సహా మొత్తం మీద 55 పతకాలు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. క్రీడలు ముగియడానికి ఇంకో రోజు మాత్రమే మిగిలి ఉండడంతో భారత్‌ ఖాతాలో మరికొన్ని పతకాలు చేరే అవకాశముంది.

నాలుగో స్థానం కోసం పోటాపోటీ..

ఇవి కూడా చదవండి

కాగా బాక్సింగ్‌తో పాటు అథ్లెటిక్స్ పరంగా భారతదేశానికి ఆదివారం (ఆగస్టు 7) చాలా మంచి రోజు. బాక్సింగ్‌లో మూడు స్వర్ణాలు, ఒక రజతం రాగా.. అదే సమయంలో అథ్లెటిక్స్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ట్రిపుల్ జంప్‌లో స్వర్ణం, రజతం సొంతం చేసుకున్నారు . ఆదివారం అథ్లెటిక్స్‌లో 1 స్వర్ణం, 2 రజతం, ఒక కాంస్యం సహా మొత్తం 4 పతకాలు వచ్చాయి. ఇవి కాకుండా టేబుల్ టెన్నిస్‌లో ఒక స్వర్ణం, ఒక కాంస్యం కూడా దక్కాయి. అదేవిధంగా హాకీలో కాంస్యం, మహిళల టీ20 క్రికెట్‌లో రజతం వచ్చాయి. బ్యాడ్మింటన్‌లో రెండు కాంస్యాలు వచ్చాయి. ఇలా ఆదివారం మొత్తం 5 స్వర్ణాలు గెల్చుకున్న భారత్ ఖాతాలో ఇప్పుడు మొత్తం 18 స్వర్ణాలుఉన్నాయి. దీంతో న్యూజిలాండ్‌ను అధిగమించి నాలుగో స్థానానికి చేరుకుంది. అయితే కివీస్‌కు, భారత జట్టుకు ఒక స్వర్ణం మాత్రమే తేడా ఉంది. నాలుగో స్థానం కోసం భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు పోటీ పడుతున్నాయి.

సింధు మ్యాచ్ పైనే దృష్టి..

కాగా బ్యాడ్మింటన్‌లో మహిళల సింగిల్స్‌, పురుషుల సింగిల్స్‌, పురుషుల డబుల్స్‌ ఫైనల్స్‌లో ఆగస్టు 8వ తేదీ సోమవారం జరిగే ఫైనల్స్‌లో భారత్‌కి స్వర్ణం గెలిచే అవకాశం ఉంది. ఇవే కాకుండా టీటీడీ ఫైనల్ కూడా ఉంది. అదే సమయంలో ఎక్కువ మంది దృష్టి భారత్‌- ఆస్ట్రేలియా పురుషుల హాకీ ఫైనల్స్‌పైనే ఉంది. ఇక పతకాల పట్టికలో 66 స్వర్ణాలతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో, 55 స్వర్ణాలతో ఇంగ్లండ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?