CWG 2022 Badminton: కామన్వెల్త్‌ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో పతకం.. కాంస్యంతో మెరిసిన కిదాంబి శ్రీకాంత్‌

Commonwealth Games2022: కామన్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింటన్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది . పురుషుల సింగిల్స్‌లో స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth ) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

CWG 2022 Badminton: కామన్వెల్త్‌ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో పతకం.. కాంస్యంతో మెరిసిన కిదాంబి శ్రీకాంత్‌
Kidambi Srikanth
Follow us

|

Updated on: Aug 08, 2022 | 7:15 AM

Commonwealth Games2022: కామన్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింటన్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది . పురుషుల సింగిల్స్‌లో స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth ) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఆదివారం అర్ధ రాత్రి జరిగిన కాంస్య పతక పోరులో సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ టెహ్‌పై 21-15, 21-18తో కిదాంబి వరుస గేమ్‌లలో విజయం సాధించాడు. కాగా 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం సాధించిన మన తెలుగుతేజం ఈసారి స్వర్ణం సాధిస్తాడని అభిమానులు ఆశించారు. అందుకు తగ్గట్లుగానే టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా రాణించాడు. అయితే సెమీస్‌లో అనూహ్య ఓటమి ఎదురవ్వడంతో కాంస్యపతకం కోసం పోరాడాల్సి వచ్చింది. కాగా ఈ మ్యాచ్లో సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ టెహ్ గాయపడినప్పటికీ గొప్ప క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. అందుకే గెలిచిన తర్వాత 87వ ర్యాంక్ ఆటగాడిని గౌరవప్రదంగా కౌగిలించుకుని అభినందనలు తెలిపాడు శ్రీకాంత్‌.

స్వ్కాష్‌లో మెరిసిన దీపిక జోడి

భారత అగ్రశ్రేణి స్క్వాష్ ద్వయం సౌరవ్ ఘోషల్, దీపికా పల్లికల్ మరోసారి తమ సత్తా చాటారు. కామన్వెల్త్ గేమ్స్ 2022 స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఈ జోడి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. కాంస్య పతక పోరులో అనుభవజ్ఞులైన భారత జోడీ 2-0తో ఆస్ట్రేలియాను ఓడించింది. సీడబ్ల్యూజీలో వీరిద్దరికీ ఇది వరుసగా రెండో పతకం. ప్రస్తుత గేమ్స్‌లో స్క్వాష్‌లో భారత్‌కు ఇది రెండో పతకం. అంతకుముందు పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ చారిత్రాత్మక కాంస్యం సాధించాడు. ఆగస్టు 7 ఆదివారం జరిగిన ఈ కాంస్య పతక మ్యాచ్‌లో, భారత జోడీ ఏకపక్ష విజయం సాధించింది. చాలా కాలంగా కలిసి ఆడుతున్న ఈ జోడీ ఆస్ట్రేలియాకు చెందిన లోబన్ డోనా, కెమరూన్ పీలేలకు ఎలాంటి అవకాశం లేకుండా 11-8, 11-4తో వరుస గేముల్లో ఓడించారు. కాగా కామన్వెల్త్ గేమ్స్‌లో స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించినందుకు దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్‌లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ‘మీ విజయం భారతదేశంలోని స్క్వాష్ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది. ఇలాంటి విజయాలు మన దేశంలో క్రీడలకు ఆదరణను పెంచుతాయి’ అని ట్విట్టర్‌ వేదికగా ప్రశంసించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో