AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zimbabwe: వామ్మో.. ఇదేం బాదుడు భయ్యా.. జింబాబ్వే గర్జనతో పాకిస్తాన్ ఆగమాగం.. ఎందుకంటే?

ICC World Cup Qualifiers 2023: విశేషమేమిటంటే వన్డే క్రికెట్‌లో జింబాబ్వే నమోదైన అత్యధిక స్కోరు ఇదే. అలాగే, వన్డే క్రికెట్‌లో 400కు పైగా పరుగులు చేసిన 7వ జట్టుగా నిలిచింది.

Zimbabwe: వామ్మో.. ఇదేం బాదుడు భయ్యా.. జింబాబ్వే గర్జనతో పాకిస్తాన్ ఆగమాగం.. ఎందుకంటే?
Zimbabwe Icc World Cup Qual
Venkata Chari
|

Updated on: Jun 27, 2023 | 6:56 AM

Share

ICC World Cup Qualifiers 2023: హరారేలో జరిగిన వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో జింబాబ్వే అద్భుతమైన ప్రదర్శనతో కొత్త రికార్డును నెలకొల్పింది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే కెప్టెన్ సీన్ విలియమ్స్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో దడదడలాడించాడు. ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా రంగంలోకి దిగిన జాయ్ లార్డ్ గుంబి (78), ఇన్నోసెంట్ (32) జింబాబ్వే జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత మూడో నంబర్‌లో బరిలోకి దిగిన విలియమ్స్ తుఫాన్ బ్యాటింగ్‌తో దుమ్మరేపాడు.

మైదానం అంతటా సిక్సుల-ఫోర్ల వర్షం కురిపించిన సీన్ విలియమ్స్.. కేవలం 65 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 101 బంతుల్లో 21 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 174 పరుగులు చేశాడు. ఫలితంగా జింబాబ్వే జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. 409 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టు 104 పరుగులకే ఆలౌటైంది. దీంతో జింబాబ్వే జట్టు 304 పరుగులతో రికార్డు సృష్టించింది.

విశేషమేమిటంటే వన్డే క్రికెట్‌లో జింబాబ్వే నమోదైన అత్యధిక స్కోరు ఇదే. అలాగే, వన్డే క్రికెట్‌లో 400కు పైగా పరుగులు చేసిన 7వ జట్టుగా నిలిచింది. ముఖ్యంగా వన్డే క్రికెట్ లో మొత్తం 953 మ్యాచ్ లు ఆడిన పాకిస్థాన్ జట్టు ఇప్పటి వరకు 400 పరుగులు చేయలేదు. అంతకుముందు జింబాబ్వేపై పాకిస్థాన్ అత్యధిక స్కోరు 399 పరుగులు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు పాకిస్థాన్ జట్టుకు సాధ్యం కానిది జింబాబ్వే జట్టు సాధించింది. ముఖ్యంగా 2015లో పాక్ జట్టు చేసిన 399 పరుగుల రికార్డును జింబాబ్వే అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించడం విశేషం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.