ICC ODI World Cup 2023 Schedule: అందరి కళ్లు భారత్, పాక్ మ్యాచ్‌పైనే.. నేడే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్?

IND vs PAK: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఈ ఏడాది అక్టోబర్‌, నవంబర్‌లో భారత్‌లో జరగనుంది. 2011 తర్వాత తొలిసారి వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే ఐసీసీ ఇప్పటి వరకు షెడ్యూల్‌ను విడుదల చేయలేదు.

ICC ODI World Cup 2023 Schedule: అందరి కళ్లు భారత్, పాక్ మ్యాచ్‌పైనే.. నేడే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్?
Icc Odi World Cup Schedule
Follow us
Venkata Chari

|

Updated on: Jun 27, 2023 | 7:50 AM

ICC ODI World Cup 2023 Schedule: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఈ ఏడాది అక్టోబర్‌, నవంబర్‌లో భారత్‌లో జరగనుంది. 2011 తర్వాత తొలిసారి వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే ఐసీసీ ఇప్పటి వరకు షెడ్యూల్‌ను విడుదల చేయలేదు. ఈ ప్రపంచకప్ షెడ్యూల్ కోసం అందరూ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అందరిచూపు ప్రపంచకప్‌లో భారత్ -పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్‌పైనే ఉంది. తాజా నివేదికల మేరకు నేడు అంటే జూన్ 27, మంగళవారం ICC ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించవచ్చని తెలుస్తోంది.

ఈ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తోన్న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొద్దిరోజుల ముందుగానే ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీకి పంపింది. ఈ ప్రపంచకప్‌లో పాల్గొనే దేశాలకు ముసాయిదా షెడ్యూల్‌ను కూడా పంపింది. దీని ప్రకారం, టోర్నమెంట్ అక్టోబర్ 5 న ప్రారంభమవుతుంది. ఫైనల్ నవంబర్ 19 న జరుగుతుంది. దీనికి ఇంకా ఐసీసీ ఆమోదం తెలపాల్సి ఉంది. మంగళవారం అవసరమైన మార్పులతో ICC ఈ షెడ్యూల్‌ను విడుదల చేయవచ్చని సమాచారం.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్‌కు ఇబ్బందులు..

బీసీసీఐ ఐసీసీకి పంపిన షెడ్యూల్ కారణంగా పాకిస్థాన్‌కు కొన్ని మ్యాచ్‌ల సమస్య ఎదురైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించగా, ఆస్ట్రేలియాతో మ్యాచ్ బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్ బెంగళూరులో నిర్వహించాలని పాకిస్థాన్ కోరుతోంది. ఆస్ట్రేలియాతో చెన్నైలో ఆడాలని కోరుతోంది.

అదే సమయంలో బీసీసీఐ ముసాయిదా షెడ్యూల్‌లో అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. దీనిపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన పాకిస్థాన్.. ఈ మ్యాచ్‌ను చెన్నై, కోల్‌కతాలో నిర్వహించాలని కోరింది. మరి ఇప్పుడు పాకిస్థాన్ డిమాండ్లు ఒప్పుకుందా లేదా తిరస్కరిస్తాయా అనేది చూడాల్సి ఉంది.

ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్?

జూన్ 12న వార్తా సంస్థ పీటీఐ నివేదిక ప్రకారం, BCCI పంపిన ముసాయిదా షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన మొదటి మ్యాచ్ ఆడవచ్చు. టోర్నీలో మొదటి మ్యాచ్ అక్టోబర్ 5న ప్రస్తుత విజేత ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగాలని ప్రతిపాదించారు. కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు సహా తొమ్మిది నగరాల్లో భారత్ తన లీగ్ మ్యాచ్‌లు ఆడవచ్చు.

ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. వాటిలో ఎనిమిది జట్లు ఇప్పటికే తమ స్థానం కన్మ్‌ఫాం చేసుకోగా.. ప్రస్తుతం జరుగుతున్న క్వాలిఫైయర్ టోర్నమెంట్ ద్వారా రెండు జట్లు ఎంట్రీ ఇస్తాయి. ఇందులో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్, ఒక సారి ప్రపంచ ఛాంపియన్ శ్రీలంక కూడా పోటీపడుతున్నాయి.

ఫైనల్ ఎక్కడంటే..

ప్రపంచకప్‌నకు సంబంధించి, ఈ టోర్నీ ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుందని, రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే స్టేడియం, ఈడెన్‌లో జరుగుతాయని సోమవారం కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల ఇక్కడ క్లిక్ చేయండి..

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్