ICC Rankings: రెండు డబుల్ సెంచరీలతో ఇంగ్లీషోళ్లపై ఊచకోత.. కట్‌చేస్తే.. ఐసీసీ ర్యాకింగ్స్‌లో జైస్వాల్ దూకుడు..
Yashasvi Jaiswal, ICC Test Ranking: న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. విలియమ్సన్ దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేయడం ద్వారా నంబర్ వన్ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. రాజ్‌కోట్ టెస్టులో సెంచరీ బాదిన ఇంగ్లండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ బెన్ డకెట్ కూడా భారీ గ్యాప్ తీసుకున్నాడు. 12 స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరుకున్నాడు. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఏడు స్థానాలు ఎగబాకి 34వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

Yashasvi Jaiswal, ICC Test Ranking: ఇంగ్లండ్‌పై వరుసగా రెండు డబుల్ సెంచరీల ఆధారంగా ఐసీసీ పురుషుల టెస్ట్ ర్యాంకింగ్‌లో యశస్వి జైస్వాల్ భారీగా ప్రయోజనం దక్కించుకున్నాడు. తన కెరీర్‌లోనే బెస్ట్ రేటింగ్ కూడా సాధించాడు. విశాఖపట్నం తర్వాత , జైస్వాల్ రాజ్‌కోట్‌లో కూడా డబుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. అయితే, తాజాగా విడుదలైన ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 14 స్థానాలు ఎగబాకి 15 వ స్థానానికి చేరుకున్నాడు. జైస్వాల్ రేటింగ్ 699లుగా నిలిచింది.
ప్రపంచంలోని టాప్ 15 టెస్ట్ బ్యాట్స్‌మెన్‌లో నలుగురు భారత బ్యాట్స్‌మెన్ ఉన్నారు. జైస్వాల్‌తో పాటు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ, రిషబ్ పంత్ కూడా టాప్ 15లో ఉన్నారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైనప్పటికీ, కోహ్లి ర్యాంకింగ్‌లో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క స్థానం జంప్ చేసి 12వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. రాజ్‌కోట్‌లో రోహిత్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సుమారు 15 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ రెండు స్థానాలు కోల్పోయి 14వ స్థానానికి చేరుకున్నాడు.
బుమ్రాకు దగ్గరగా వచ్చిన ఆర్ అశ్విన్..
India players on the rise in the latest ICC Men’s Player Rankings after massive England victory 👏https://t.co/xaBGlJu9Bt
— ICC (@ICC) February 21, 2024
న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. విలియమ్సన్ దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేయడం ద్వారా నంబర్ వన్ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. రాజ్‌కోట్ టెస్టులో సెంచరీ బాదిన ఇంగ్లండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ బెన్ డకెట్ కూడా భారీ గ్యాప్ తీసుకున్నాడు. 12 స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరుకున్నాడు. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఏడు స్థానాలు ఎగబాకి 34వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అనుభవజ్ఞుడైన స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఒక స్థానం ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. అతను నంబర్ వన్ జస్ప్రీత్ బుమ్రాకు చాలా దగ్గరయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




