AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Points Table: డబ్యూటీసీ ఫైనల్ ఆశలపై కొలంబో దెబ్బ.. పాయింట్ల పట్టికలో దిగజారిన టీమిండియా

WTC Points Table: శ్రీలంకతో కొలంబో టెస్టు డ్రాగా ముగియడంతో డబ్యూటీసీ 2025-27 పాయింట్ల పట్టికలో భారత్ విన్నింగ్ పర్సంటేజ్ 51.51కి పడిపోయింది. ఫైనల్ రేసులో టీమిండియా పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇంకా ఏడు టెస్టులు ఆడాల్సి ఉండటంతో, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లలో భారీ విజయాలు సాధిస్తేనే భారత్ ఫైనల్ బెర్త్ దక్కించుకునే అవకాశాలు మెరుగుపడతాయి. ఇప్పుడు ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది.

WTC Points Table: డబ్యూటీసీ ఫైనల్ ఆశలపై కొలంబో దెబ్బ.. పాయింట్ల పట్టికలో దిగజారిన టీమిండియా
Wtc Points Table
Rakesh
|

Updated on: Aug 27, 2026 | 6:45 PM

Share

WTC Points Table: శ్రీలంకతో కొలంబోలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగియడంతో భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్యూటీసీ) ఫైనల్ ఆశలకు ఎదురుదెబ్బ తగిలింది. చేతిలో ఉన్న విజయం చేజారడంతో పాయింట్ల పట్టికలో విన్నింగ్ పర్సంటేజ్ పడిపోయి, ఫైనల్ బెర్త్ రేసు క్లిష్టంగా మారింది. కొలంబో టెస్టు నాలుగో రోజు వరకు మ్యాచ్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా సులువుగా విజయం సాధిస్తుందని అందరూ భావించారు. ఐదో రోజు లంక బ్యాటర్లు చూపించిన అసాధారణ పోరాట పటిమ కారణంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకున్నప్పటికీ, డబ్యూటీసీ 2025-27 సైకిల్‌లో ఈ డ్రా పెద్ద నష్టాన్ని మిగిల్చింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే భారత్ విన్నింగ్ పర్సంటేజ్ 60 శాతం దాటి, నాలుగో స్థానానికి చేరేది. ఈ డ్రా ఫలితంతో విన్నింగ్ పర్సంటేజ్ 53.33 శాతం నుంచి ఏకంగా 51.51 శాతానికి పడిపోయి ఐదో స్థానానికే పరిమితమైంది.

ప్రస్తుత డబ్యూటీసీ సైకిల్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 80 శాతం విన్నింగ్ పర్సంటేజ్‌తో మొదటి స్థానంలో కొనసాగుతోంది. సౌతాఫ్రికా 75 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు బలమైన స్థితిలో ఉండటంతో భారత్‌కు ఫైనల్ బెర్త్ సాధించడం సవాలుగా మారింది. సాధారణంగా డబ్యూటీసీ ఫైనల్ చేరుకోవడానికి కనీసం 60 శాతం విన్నింగ్ పర్సంటేజ్ అవసరం అవుతుంది. ప్రస్తుత సమీకరణాల ప్రకారం 60 శాతం సాధించినా కూడా టాప్ 2 జట్ల ఆధిక్యం దృష్ట్యా అది సరిపోకపోవచ్చు.

ఈ డబ్యూటీసీ సైకిల్‌లో భారత్ ఇంకా 7 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో న్యూజిలాండ్‌తో 2 మ్యాచ్‌లు, ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల సుదీర్ఘ సిరీస్ ఉన్నాయి. భారత్ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ 7 మ్యాచ్‌లలో అత్యధిక విజయాలు నమోదు చేయడం తప్పనిసరి. ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనలో విజయం సాధించడం భారత్‌కు ఎంతో కీలకం కానుంది. ఏ ఒక్క మ్యాచ్‌లో పొరపాటు జరిగినా ఫైనల్ అవకాశాలు చేజారే ప్రమాదం ఉంది.

వరుసగా రెండోసారి నిరాశ ఎదురవుతుందా?

తొలి రెండు డబ్యూటీసీ సైకిళ్లలో టీమిండియా ఫైనల్ చేరినప్పటికీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. గత 2023-25 సైకిల్‌లో అసలు ఫైనల్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడు కొలంబో డ్రాతో ఈ సైకిల్‌లోనూ ఫైనల్ దారి ముళ్లబాటగా మారింది. రాబోయే సిరీస్‌లలో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తేనే ఫైనల్ కలను నిజం చేసుకోగలదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us