AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devi Sri Prasad: దేవిశ్రీ–ఐశ్వర్య రాజేష్.. వాట్ అమ్మ.. వాటీజ్ దిస్ అమ్మ..

ఎయిర్‌పోర్టులో దేవిశ్రీ ప్రసాద్, ఐశ్వర్య రాజేష్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. వీరిద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉందా? లేక దేవిశ్రీ హీరోగా నటిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమాకు సంబంధించిన సమావేశమా? అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Devi Sri Prasad: దేవిశ్రీ–ఐశ్వర్య రాజేష్.. వాట్ అమ్మ.. వాటీజ్ దిస్ అమ్మ..
Devisri Prasad Aishwarya Rajesh
Ram Naramaneni
|

Updated on: Oct 07, 2026 | 11:32 AM

Share

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న విషయమే అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఇద్దరు క్రేజీ సెలబ్రిటీలు ఒకే చోట కనిపిస్తే.. ఇక నెటిజన్ల ఊహలకు హద్దే ఉండదు. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లో అలాంటి చర్చకే కారణమయ్యారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఎన్నో ఏళ్లుగా తన ఎనర్జిటిక్ మ్యూజిక్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న దేవిశ్రీ ప్రసాద్.. ప్రస్తుతం సంగీత దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ కొత్త అవతారం ఎత్తుతున్నారు. ‘ఎల్లమ్మ’ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు విభిన్నమైన కథలు, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వీరిద్దరూ ఎయిర్‌పోర్టులో ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో.. అసలు వీరిద్దరూ కలిసి ఎందుకు కనిపించారు? అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు.

కలిసి కనిపించడంపై రకరకాల ఊహాగానాలు

దేవిశ్రీ ప్రసాద్, ఐశ్వర్య రాజేష్ ఒకే చోట కనిపించడం వెనుక కారణమేంటనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. వీరి మధ్య ఏదైనా ప్రత్యేక అనుబంధం ఉందా? ఇద్దరూ కలిసి ప్రయాణించారా? అంటూ కొందరు ప్రశ్నిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇది కేవలం అనుకోకుండా జరిగిన సాధారణ మీటింగ్ అయి ఉండొచ్చని అంటున్నారు. అయితే మరో ఆసక్తికరమైన చర్చ కూడా ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోయిన్ పాత్ర విషయంలో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఐశ్వర్య రాజేష్ పేరు తెరపైకి రావడం ఆసక్తిని పెంచుతోంది. ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో భాగమవుతున్నారా? ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చల కోసమే వీరిద్దరూ కలిశారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మూవీ యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు.

డీఎస్పీ చుట్టూ గతంలోనూ డేటింగ్ రూమర్స్

దేవిశ్రీ ప్రసాద్ వ్యక్తిగత జీవితం గురించి గతంలోనూ పలుమార్లు రూమర్స్ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా మరో నటి, ప్రస్తుత నిర్మాతతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యంపై అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే తాము మంచి స్నేహితులం మాత్రమేనని ఇద్దరూ స్పష్టం చేశారు. అలాగే ప్రణీతతో డేటింగ్‌లో ఉన్నారంటూ ఓ దశలో వార్తలు వచ్చాయి. ‘రంగస్థలం’ సమయంలో పూజిత పొన్నాడతో డీఎస్పీకి సంబంధించి మరో రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఆ ప్రచారాన్ని పూజిత పొన్నాడ ఖండించారు.

ఇద్దరి కెరీర్‌లోనూ ఫుల్ స్పీడ్

రూమర్స్ సంగతి పక్కన పెడితే.. కెరీర్ పరంగా దేవిశ్రీ ప్రసాద్, ఐశ్వర్య రాజేష్ ఇద్దరూ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. దేవిశ్రీ ఇప్పటికే ఎన్నో పాన్ ఇండియా చిత్రాలకు సంగీతం అందిస్తూ.. ఇప్పుడు ‘ఎల్లమ్మ’తో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరోవైపు ఐశ్వర్య రాజేష్ తమిళంతో పాటు తెలుగులోనూ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

మరి ఎయిర్‌పోర్ట్‌లో దేవిశ్రీ–ఐశ్వర్య కలిసి కనిపించడం వెనుక అసలు కారణం ఏమిటి? ఇది కేవలం అనుకోకుండా జరిగిన భేటీనా? లేక ‘ఎల్లమ్మ’ సినిమాకు సంబంధించిన కొత్త ట్విస్టా? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Follow Us