AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajit Agarkar: అగార్కర్ వల్లే భువీ కంబ్యాక్ ఆగిపోయిందా? వైరల్ అవుతున్న షాకింగ్ రిపోర్ట్

Ajit Agarkar: మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వల్లే భువనేశ్వర్ కుమార్ టీమిండియా కమ్‌ బ్యాక్ ఆలస్యమైందని నివేదికలు చెబుతున్నాయి. అగార్కర్ తప్పుకున్న తర్వాత ప్రజ్ఞాన్ ఓజా నేతృత్వంలోని కమిటీ భువీని న్యూజిలాండ్ T20 సిరీస్‌ కు ఎంపిక చేసింది.

Ajit Agarkar: అగార్కర్ వల్లే భువీ కంబ్యాక్ ఆగిపోయిందా? వైరల్ అవుతున్న షాకింగ్ రిపోర్ట్
Bhuvneshwar Kumar
Rakesh
|

Updated on: Oct 07, 2026 | 11:30 AM

Share

Ajit Agarkar: టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో భువికి చోటు దక్కడం అభిమానులకు ఊరటనిచ్చింది. అయితే ఇన్నాళ్లూ ఆయనను జట్టులోకి తీసుకోకపోవడానికి మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కరే ప్రధాన కారణమంటూ ఒక దిగ్భ్రాంతికర కథనం వెలుగులోకి వచ్చింది. అగార్కర్ పదవీ కాలం ముగియడం, ప్రజ్ఞాన్ ఓజా నేతృత్వంలోని తాత్కాలిక సెలెక్షన్ కమిటీ రావడం వెనువెంటనే జరగడంతో భువి కమ్‌బ్యాక్ సాధ్యమైంది.

భువిని పక్కన పెట్టిన అగార్కర్

గత కొంతకాలంగా ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ భువనేశ్వర్ కుమార్‌ను అగార్కర్ సెలెక్షన్ కమిటీ వరుసగా పక్కన పెడుతూ వచ్చింది. భవిష్యత్తు అవసరాల కోసం కేవలం యంగ్ ఫాస్ట్ బౌలర్లను మాత్రమే ప్రోత్సహించాలని అగార్కర్ గట్టిగా భావించడమే దీనికి కారణమని తెలుస్తోంది. కమిటీలోని మాజీ పేసర్ ఆర్‌పీ సింగ్ పలుమార్లు భువీ పేరును ప్రతిపాదించినా, అగార్కర్ మద్దతు లభించకపోవడంతో ఆయన రీఎంట్రీ ఆలస్యమైందని ఆ నివేదిక పేర్కొంది.

ప్రజ్ఞాన్ ఓజా కమిటీ నిర్ణయంతో ఛాన్స్

అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా తప్పుకున్న తర్వాత బీసీసీఐ ప్రజ్ఞాన్ ఓజాను తాత్కాలిక సెలెక్షన్ కమిటీ హెడ్‌గా నియమించింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఓజా, భువనేశ్వర్ అనుభవంపై పూర్తి నమ్మకం ఉంచి న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేశారు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటును భర్తీ చేసేందుకు, అనుభవజ్ఞుడైన భువీ ఉండటం జట్టుకు ఎంతో ప్రయోజనకరమని సెలెక్టర్లు భావించారు. 36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్‌లో ఆర్‌సిబి వరుసగా రెండు టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించారు.

ఆర్సీబీ తరఫున వికెట్ల పండగ

భువి రీఎంట్రీ కేవలం పాత పేరు చూసి ఇచ్చినది కాదు. ఐపీఎల్ 2025లో ఆర్‌సిబి తరఫున 14 మ్యాచుల్లో 17 వికెట్లు, 2026 సీజన్‌లో 16 మ్యాచుల్లో ఏకంగా 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో సత్తా చాటారు. భారత్ తరఫున ఇప్పటివరకు 87 T20 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్, కొత్త బంతితో స్వింగ్ చేసే నైపుణ్యంతో మళ్లీ టీమిండియాలో మెరవడానికి సిద్ధమయ్యారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో యంగ్ టీమ్‌తో కలిసి ఆయన న్యూజిలాండ్ సిరీస్‌లో ఆడనున్నారు.

న్యూజిలాండ్ సిరీస్‌కు టీమిండియా T20 స్క్వాడ్

న్యూజిలాండ్ సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ, అక్షర్ పటేల్, శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ స్థానం సంపాదించారు. ఈ యంగ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ కాంబినేషన్ సిరీస్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us