The Paradise OTT: ఓటీటీలో ‘ది ప్యారడైజ్’ ! నాని బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నేచురల్ స్టార్ నాని, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ సినిమా ' ది ప్యారడైజ్'. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా రూ. 180 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ది ప్యారడైజ్’. దసరా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించారు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొంందిన ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లలో మాత్రం నాని సినిమా అదరగొట్టింది. ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 180 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఒక్క తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ నాని సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఓవర్సీస్ లోనూ ది ప్యారడైజ్ కు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ది ప్యారడైజ్ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్ గా నటించింది. అలాగే శికంజా మాలిక్ అనే కరడు గట్టిన విలన్ పాత్రలో మోహన్ బాబు ఒదిగిపోయారు. వీరితో పాటు రాఘవ్ జుయేల్, సంపూర్ణేష్, ప్రియదర్శి, సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ది ప్యారడైజ్ సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాని మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై సామాజిక మాధ్యమాల్లో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది.
థియేటర్లలో మిస్ అయిన సినీ ప్రియులు ‘ది ప్యారడైజ్’ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ది ప్యారడైజ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ తర్వాత 6 నుంచి 8 వారాల తర్వాతే మాత్రమే సినిమాను ఓటీటీలోకి తీసుకువచ్చేలా అగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో నవంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ది ప్యారడైజ్ సినిమా స్ట్రీమింగ్ కు రావొచ్చని తెలుస్తోంది.
కాగా రన్ టైమ్ కారణంగా ఈ సినిమా నుంచి ఒక పవర్‌ఫుల్ ‘దేశం’ సాంగ్‌ను థియేటర్లలో తప్పనిసరి పరిస్థితుల్లో తీసి వేయాల్సి వచ్చింది. అయితే సిల్వర్ స్క్రీన్ పై మిస్ అయిన ఆ గూస్ బంప్స్ సాంగ్ ను ఓటీటీ వెర్షన్ లో జోడించనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల స్వయంగా వెల్లడించారు. దీంతో ది ప్యారడైజ్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




