WTC 2025 Final: బ్లాక్ బ్యాండ్‌లతో బరిలోకి ఆసీస్, సౌతాఫ్రికా ఆటగాళ్లు.. కారణం ఏంటో తెలుసా?
ICC World Test Championship Final 2025 Final: మూడో రోజు ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. 144/8తో 3వ రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్ కొన్ని నిమిషాల్లోనే, లియాన్ రూపంలో వికెట్ కోల్పోయింది. కగిసో రబాడ లియాన్‌ను LBWగా అవుట్ చేశాడు. మిచెల్ స్టార్క్ తన ఆద్భుత ఆటతీరుతో ప్రస్తుతం 44 పరుగులతో ఆసీస్ లీడ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నాడు.

ICC World Test Championship Final 2025 Final: లార్డ్స్‌లోని ప్రతిష్టాత్మక క్రికెట్ మైదానంలో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు మానవత్వాన్ని చాటుకున్నాయి. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించేందుకు రెండు జట్ల ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు బ్లాక్ ఆర్మ్ బ్యాండ్‌లు ధరించి మైదానంలోకి అడుగుపెట్టారు. ఆట ప్రారంభానికి ముందు ఒక నిమిషం మౌనం పాటించి మృతులకు సంతాపం తెలిపారు.
గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాట్విక్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అహ్మదాబాద్‌లోని మేఘ్ నగర్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ దురదృష్టకర సంఘటనలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 169 మంది భారత పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ పౌరులు, ఒక కెనడియన్ పౌరుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ విషాద వార్త క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మానవతా దృక్పథంతో, ఐసీసీ ఆదేశాల మేరకు WTC ఫైనల్ మూడవ రోజు ఆట ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాయి. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా సానుభూతిని రేకెత్తించగా, క్రీడా ప్రపంచం కూడా తమ వంతుగా మృతులకు నివాళులు అర్పించింది.
లార్డ్స్ మైదానంలో ఈ దృశ్యం భావోద్వేగంగా నిలిచింది. ఆటగాళ్లు తమ ఆట పట్ల నిబద్ధతను చూపుతూనే, మానవతా విలువలకు ప్రాధాన్యత ఇచ్చి, ఈ విషాదానికి నివాళులు అర్పించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ కఠిన సమయంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది.
మూడో రోజు ఆట పరిస్థితి..
మూడో రోజు ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. 144/8తో 3వ రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్ కొన్ని నిమిషాల్లోనే, లియాన్ రూపంలో వికెట్ కోల్పోయింది. కగిసో రబాడ లియాన్‌ను LBWగా అవుట్ చేశాడు. మిచెల్ స్టార్క్ తన ఆద్భుత ఆటతీరుతో ప్రస్తుతం 44 పరుగులతో ఆసీస్ లీడ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆసీస్ 260 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చివరి వికెట్ కోసం సౌతాఫ్రికా బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అంతకుముందు, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 21 పరుగులకే ఆలౌట్ అయింది. కానీ, ఆస్ట్రేలియన్ దాడి కూడా దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించే అవకాశం ఇవ్వలేదు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 138 పరుగులకే ముగించడం ద్వారా 74 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ 28 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఉత్తేజకరమైన మలుపుకు చేరుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో వెనుకబడినప్పటికీ దక్షిణాఫ్రికా తన ఐసీసీ టైటిల్ కరువును ముగించే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..