AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SA vs IND: సఫారీలపై ఘన విజయం.. WTC పాయింట్ల పట్టికలో మళ్లీ ‘టాప్‌’ లేపిన టీమిండియా.. ఆరో ప్లేస్‌ నుంచి..

కేప్‌ టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతకు ముందు సెంచూరియన్‌ ఆతిథ్యమిచ్చిన తొలి టెస్టులో చిత్తుగా ఓడడంతో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ పాయింట్ల పట్టికలో రోహిత్‌ సేన ఏకంగా ఆరో స్థానానికి పడిపోయింది.

SA vs IND: సఫారీలపై ఘన విజయం.. WTC పాయింట్ల పట్టికలో మళ్లీ 'టాప్‌' లేపిన టీమిండియా.. ఆరో ప్లేస్‌ నుంచి..
Team India
Basha Shek
|

Updated on: Jan 04, 2024 | 7:30 PM

Share

కేప్‌ టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతకు ముందు సెంచూరియన్‌ ఆతిథ్యమిచ్చిన తొలి టెస్టులో చిత్తుగా ఓడడంతో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ పాయింట్ల పట్టికలో రోహిత్‌ సేన ఏకంగా ఆరో స్థానానికి పడిపోయింది. అయితే సఫారీలను దెబ్బకు దెబ్బ తీసి కేప్‌ టౌన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. దీంతో WTC పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి దూసుకొచ్చింది భారత జట్టు. కేప్ టౌన్ టెస్టులో విజయంతో భారత్‌ ఖాతాలో మొత్తం 12 పాయింట్లు చేరాయి. దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత 54.16 PCT పాయింట్లతో భారత్ టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ 50 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక ఉన్నాయి

ఈ నెలాఖరులో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో భారత్‌ 5-0తో ఇంగ్లండ్‌ను చిత్తు చేస్తే ఫైనల్‌ స్థానం దాదాపు ఖాయం. అయితే అదంత సులభమేమీ కాదు. మరోవైపు దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ పర్యటనకు బయలు దేరనుంది. కాబట్టి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టాప్‌ ప్లేస్‌ దోబూచులాడుతోంది. కేప్‌ టౌన్‌ వేదికగా ముగిసిన రెండో టెస్టులో తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టీమిండియా బౌలర్లు పిచ్‌ను సద్వినియోగం చేసుకుని దక్షిణాఫ్రికా జట్టు మొత్తాన్ని 55 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఆ తర్వాత టీమిండియా 153 పరుగులకు ఆలౌటైంది. ఆశ్చర్యకరంగా తొలిరోజు మొత్తం 23 వికెట్లు పడ్డాయి. ఇక రెండో ఇన్నింగ్స్‌ లో దక్షిణాఫ్రికా 176 పరుగులు మాత్రమే చేసి భారత్‌ కు 79 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్‌ను మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది రోహిత్‌ సేన.

ఇవి కూడా చదవండి

ఆరో స్థానానికి పాకిస్తాన్..

భారత జట్టుకు జైషా అభినందనలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
బస్టాండ్‌లో పడుకున్న పశువుల్ని లేపిన పాపానికి..ప్రాణం బలి!
బస్టాండ్‌లో పడుకున్న పశువుల్ని లేపిన పాపానికి..ప్రాణం బలి!
ఒక కప్పు గోదుమపిండి 2 ఉల్లిపాయలతో చేసే హెల్ది టిఫిన్..
ఒక కప్పు గోదుమపిండి 2 ఉల్లిపాయలతో చేసే హెల్ది టిఫిన్..