WPL 2024 Final Highlights: ఢిల్లీని చిత్తు చేసిన బెంగళూరు.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ బెంగళూరుదే..
WPL Final 2024 DC vs RCB Live Cricket Score: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ బెంగళూరు 2008 నుంచి IPLలో భాగంగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు రెండు ఫ్రాంచైజీలు టైటిల్‌ను గెలవలేకపోయాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కసారి పూర్తి చేయగా, బెంగళూరు జట్లు మూడుసార్లు రన్నరప్‌గా నిలిచాయి. అంటే రెండు జట్లలో ఏదో ఒక జట్టు తొలిసారి ఈ టైటిల్ గెలుస్తుందన్న విషయం ఒక్కటి మాత్రం స్పష్టం.

WPL Final 2024 DC vs RCB Live Cricket Score in Telugu: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 113 పరుగులకే ఆలౌట్ అయింది. 114 పరుగుల టార్గెత్ బరిలోకి దిగిన బెంగళూరు జట్టు ప్రస్తుతం వికెట్ నష్టపోకుండా 7 ఓవర్లలో 43 పరుగులు చేసింది. మంథాన 12, డివైన్ 31 పరుగులతో నిలిచారు.
ఢిల్లీకి తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ ఓపెనర్లు వచ్చారు. 44 పరుగుల వద్ద షెఫాలీ వర్మ ఔటైంది. కాగా కెప్టెన్ లానింగ్ 23 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. ఆ తర్వాత, జెమీమా, ఆలిస్ క్యాప్స్ కూడా ఔట్ అయ్యారు. దీంతో ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది. ఆర్‌సీబీ తరపున సోఫీ మోలినిక్స్ 3 వికెట్లు పడగొట్టింది. శ్రేయాంక 4 వికెట్లు తీసింది. ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. కాగా ఢిల్లీ చివరి రన్నరప్‌గా నిలిచింది. ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్‌ను 5 పరుగుల తేడాతో ఓడించి స్మృతి మంధాన టీం బెంగళూరు ఫైనల్‌కు టిక్కెట్‌ను బుక్ చేసుకుంది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇప్పుడు ఫైనల్‌లో ఇరుజట్ల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని భావిస్తున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ బెంగళూరు 2008 నుంచి IPLలో భాగంగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు రెండు ఫ్రాంచైజీలు టైటిల్‌ను గెలవలేకపోయాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కసారి పూర్తి చేయగా, బెంగళూరు జట్లు మూడుసార్లు రన్నరప్‌గా నిలిచాయి. అంటే రెండు జట్లలో ఏదో ఒక జట్టు తొలిసారి ఈ టైటిల్ గెలుస్తుందన్న విషయం ఒక్కటి మాత్రం స్పష్టం.
లీగ్‌లో ఇప్పటి వరకు ఢిల్లీ, ఆర్‌సీబీ జట్ల పరిస్థితి..
లీగ్‌లో ఇప్పటి వరకు ఢిల్లీ, ఆర్‌సీబీ జట్లు రెండుసార్లు తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ జట్టు రెండుసార్లు విజయం సాధించింది. ఢిల్లీ జట్టు ప్రతి అంశంలోనూ ఆర్‌సీబీపై విజయం సాధించింది. రెండు జట్ల లీగ్ ప్రదర్శనను పరిశీలిస్తే, రెండు జట్లు 8 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో ఢిల్లీ 6 మ్యాచ్‌లు గెలిచి 2 ఓడగా, RCB 4 మ్యాచ్‌లు గెలిచి 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫామ్‌తో పాటు స్వదేశీ పరిస్థితులు రెండింటినీ ఢిల్లీకి సద్వినియోగం చేసుకుంటుందని, దాని కారణంగానే మ్యాచ్‌లో ఢిల్లీదే పైచేయి అవుతుందని భావిస్తున్నారు.
ఇరుజట్ల ప్లేయింగ్ 11:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ (కీపర్), సోఫీ మోలినక్స్, జార్జియా వేర్‌హామ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, శ్రద్ధా పోఖర్కర్, రేణుకా థాకర్కర్, రేణుక.
ఢిల్లీ క్యాపిటల్స్(ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్(కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, జెస్ జోనాస్సెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా(కీపర్), శిఖా పాండే, మిన్ను మణి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




