AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్‌ లో షారుఖ్‌ స్పెషల్ పర్ఫామెన్స్ .. ఫ్రీగా లైవ్ స్ట్రీమింగ్‌.. ఎక్కడ చూడొచ్చంటే?

ఐపీఎల్‌ లాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ని కూడా కలర్‌ ఫుల్‌ గా మార్చాలనుకుంటోంది బీసీసీఐ. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. WPL 2024 రెండవ ఎడిషన్ శుక్రవారం (ఫిబ్రవరి 23) నుండి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓపెనింగ్ వేడుకను ఏర్పాటు చేయనున్నారు. సెలబ్రేషన్స్ లో భాగంగా పలువురు బాలీవుడ్ తారలు అభిమానులను అలరించనున్నారు.

WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్‌ లో షారుఖ్‌ స్పెషల్ పర్ఫామెన్స్ .. ఫ్రీగా లైవ్ స్ట్రీమింగ్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
Shah Rukh Khan
Basha Shek
|

Updated on: Feb 22, 2024 | 12:55 PM

Share

ఐపీఎల్‌ లాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ని కూడా కలర్‌ ఫుల్‌ గా మార్చాలనుకుంటోంది బీసీసీఐ. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. WPL 2024 రెండవ ఎడిషన్ శుక్రవారం (ఫిబ్రవరి 23) నుండి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓపెనింగ్ వేడుకను ఏర్పాటు చేయనున్నారు. సెలబ్రేషన్స్ లో భాగంగా పలువురు బాలీవుడ్ తారలు అభిమానులను అలరించనున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ ప్రదర్శన ఇస్తారని వార్తలు వస్తున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఫిబ్రవరి 23న చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. దీనికి ముందు బీసీసీఐ ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో కింగ్ ఖాన్ స్పెషల్‌ పర్ఫామెన్స్ ఇవ్వనున్నాడు. ఆయనతో పాటు వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, టైగర్ ష్రాఫ్, కార్తీక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్రా WPL ప్రారంభ వేడుకల్లో సందడి చేయనున్నారు.

షారూఖ్ ఖాన్‌కు క్రికెట్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. రెండుసార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్, అలాగే ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, అబుదాబి నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలకు యజమానిగా వ్యవహరిస్తోన్నాడు షారుక్‌. అయితే సాధారణంగా కేకేఆర్ మ్యాచ్ లు జరిగినప్పుడు మాత్రమే గ్యాలరీలో కనిపిస్తాడు బాలీవుడ్ బాద్‌ షా. అయితే ఇప్పుడు మహిళల ప్రీమియర్ లీగ్‌ లో స్పెషల్‌ ఫర్పామెన్స్ తో ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యాడీ స్టార్ హీరో. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు జరగనుంది. గతేడాది మాదిరిగానే మొత్తం ఐదు జట్లు 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి. . 24 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఒక్క డబుల్ హెడర్ మ్యాచ్ కూడా ఉండదు. ప్రతి రోజు ఒక మ్యాచ్ మాత్రమే ఆడతారు. ఎలిమినేటర్ మ్యాచ్ మార్చి 15న, ఫైనల్ మార్చి 17న ఢిల్లీలో జరగనుంది.

ఇవి కూడా చదవండి

షాహిద్ కపూర్..

సిద్ధార్థ్ మల్హోత్రా..

కార్తీక్ ఆర్యన్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?