WPL 2023: సీజన్ ప్రారంభానికి ముందే గుజరాత్‌కు భారీ షాక్.. కీలక ప్లేయర్ దూరం..
Womens IPL 2023: సీజన్ ప్రారంభానికి ముందు, గుజరాత్ జెయింట్స్ జట్టు గాయం కారణంగా మొత్తం సీజన్‌కు దూరమైన డియాండ్రా డాటిన్ రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) మొదటి ఎడిషన్ మార్చి 4న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మహిళల జట్టు మధ్య మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందే, గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమైన డియాండ్రా డాటిన్ రూపంలో గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ఆమె స్థానంలో ఆస్ట్రేలియా మహిళా క్రీడాకారిణి కింబర్లీ గ్రెత్‌ను చేర్చుకున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది.
ఈ సమాచారాన్ని ఫ్రాంచైజీ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అందించింది. అందులో సీజన్ ప్రారంభానికి ముందు కింబర్లీ గ్రెత్‌ను భర్తీ చేసే ప్లేయర్‌గా అదానీ గుజరాత్ జెయింట్స్ ప్రకటించింది. ఇందులో విండీస్ ఆల్ రౌండర్ ప్లేయర్ డియాండ్రా డాటిన్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ కిమ్ గ్రెత్‌ను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించారు.
గుజరాత్ జెయింట్స్ జట్టు 60 లక్షల రూపాయలకు వేలం సమయంలో తమ జట్టులో డియాండ్రా డాటిన్‌ను చేర్చుకుంది. గ్రెత్‌ను ఏ జట్టు తీసుకోలేదు. అదే సమయంలో ఇటీవల టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టులో భాగమైన ఫాస్ట్ బౌలర్ గ్రెత్ అక్కడ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్‌లలో చాలా అద్భుతంగా రాణించాడు.
2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఫాస్ట్ బౌలర్ కింబర్లీ గ్రెత్ ఇప్పటివరకు 28 వన్డేలతో 54 టీ20 మ్యాచ్‌లు ఆడింది. అందులో ఆమె వరుసగా 23, 43 వికెట్లు పడగొట్టింది. ఇది కాకుండా, లోయర్ ఆర్డర్‌లో కిమ్ బ్యాటింగ్ కూడా జట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
గుజరాత్ జట్టుకు కెప్టెన్‌గా బెత్ మూనీ..
గుజరాత్ జెయింట్స్ జట్టు గురించి మాట్లాడితే, మొదటి సీజన్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు వెటరన్ ప్లేయర్ బెత్ మూనీ కెప్టెన్సీని నిర్వహించడం కనిపిస్తుంది. ఆష్లే గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్ రూపంలో ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్లు కూడా జట్టులో ఉంటారు. వీరు మ్యాచ్ స్పరూపాన్నే మార్చేయగలరు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..