World Test Championship: జోహన్నెస్‌బర్గ్ ఓటమితో టీమిండియాకు భారీ షాక్.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం కష్టమేనా?

Team India: జోహన్నెస్‌బర్గ్‌ ఓటమితో దక్షిణాఫ్రికాలో తొలి టెస్ట్ సిరీస్‌ను గెలుచుకోవాలనే భారత్ ఆశలపై ప్రభావం చూపింది. ఇది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియాకు ..

World Test Championship: జోహన్నెస్‌బర్గ్ ఓటమితో టీమిండియాకు భారీ షాక్.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం కష్టమేనా?
World Test Championships 2021 23
Follow us
Venkata Chari

|

Updated on: Jan 07, 2022 | 1:01 PM

India vs South Africa: జోహన్నెస్‌బర్గ్ టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ ఓటమి ప్రభావం దక్షిణాఫ్రికాలో తొలి టెస్టు సిరీస్‌ను గెలుచుకోవాలనే భారత ఆశలపై దారుణంగా దెబ్బ పడింది. అది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలోనూ ప్రభావం చూపించింది. భారత్‌ను ఓడించి ఆతిథ్య దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది. కాబట్టి అదే సమయంలో, టీమ్ ఇండియాకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరడం ప్రస్తుతం కొంచెం కష్టంగా కనిపిస్తోంది. WTC ఫైనల్ ఆడటానికి టీమిండియా ముందున్న మార్గాలేంటో ఓసారి చూద్దాం..

జోహన్నెస్‌బర్గ్‌లో భారత్‌ను ఓడించి దక్షిణాఫ్రికా కొత్త సంవత్సరంలో తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. ఒక విజయం, ఒక ఓటమి తర్వాత, ప్రస్తుతం 12 పాయింట్లను కలిగి ఉంది. పట్టికలో భారతదేశం తర్వాత 5వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 36 పాయింట్లతో 100 శాతం విజయంతో పాయింట్ల పట్టికలో నంబర్ వన్‌గా ఉంది. మరోవైపు శ్రీలంక జట్టు రెండో స్థానంలో ఉంది. 2 టెస్టులు గెలిచిన శ్రీలంక 24 పాయింట్లతో ఉంది. ఈ రెండు అగ్రశ్రేణి జట్లు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. మరోవైపు, పాకిస్థాన్ జట్టు 3 విజయాలు, 1 ఓటమి, 36 పాయింట్లు, విజయ శాతం 75తో మూడో స్థానంలో ఉంది.

WTCలో భారత్ మూడో సిరీస్ ఆడుతోంది.. అయితే పాయింట్లు, విజయాల శాతంలో భారత జట్టు నష్టపోయింది. ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మూడో సిరీస్‌ను ఆడుతున్న టీమ్‌ఇండియా ఇప్పటి వరకు 4 విజయాలు, 2 ఓటములు, 2 డ్రాలను సాధించింది. గెలుపు శాతం 55.21 నుంచి తగ్గింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ తర్వాత, స్లో ఓవర్ రేట్ కారణంగా టీమ్ ఇండియా 3 పాయింట్ల భారాన్ని చవిచూసింది. దీని కారణంగా పాయింట్లు కూడా 53కి పడిపోయాయి. ప్రస్తుతం టీమిండియా పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

టీమ్ ఇండియా ముందుకు సాగాలంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలంటే భారత్ టాప్ 2 టీమ్‌లో నిలవడం తప్పనిసరి. దీని కోసం, ఇప్పుడు రాబోయే మ్యాచ్‌లలో మంచి ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. భారత్‌కు మరో 3 మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ 3 మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో మ్యాచ్ జరగనుంది. కాగా మిగిలిన 2 మ్యాచ్‌లు శ్రీలంకతో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడావాల్సి ఉంది. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాను ఓడించడం ద్వారా భారత్ టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుని, ఆపై శ్రీలంకను తన సొంత గడ్డపై క్లియర్ చేస్తే, అది ఖచ్చితంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

Also Read: Srihan: సిరి ప్రియుడికి బిగ్ బాస్ భారీ ఆఫర్.? నెట్టింట వైరల్!

Lakshya In Aha: ఆహాలో అలరించనున్న లక్ష్య.. నేటినుంచే స్ట్రీమింగ్..!