పాక్‌కు అఫ్గాన్ దెబ్బ

అంతర్జాతీయ క్రికెట్ లో గత కొద్దికాలంగా అందరిని ఆకర్షిస్తున్న జట్టు ‘ఆఫ్ఘనిస్థాన్’. ఇక ఐదు రోజులలో ప్రపంచకప్ ప్రారంభం అవుంతుండగా ఈ చిన్న జట్టు సంచలనాలు సృష్టిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. అందుకు తగ్గతే.. శుక్రవారం పాకిస్థాన్ తో జరిగిన వరల్డ్ కప్ సన్నాహక మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్‌ 47.5 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. బాబర్‌ అజామ్‌ (112; 108 బంతుల్లో […]

పాక్‌కు అఫ్గాన్ దెబ్బ
Follow us
Ravi Kiran

|

Updated on: May 25, 2019 | 12:15 PM

అంతర్జాతీయ క్రికెట్ లో గత కొద్దికాలంగా అందరిని ఆకర్షిస్తున్న జట్టు ‘ఆఫ్ఘనిస్థాన్’. ఇక ఐదు రోజులలో ప్రపంచకప్ ప్రారంభం అవుంతుండగా ఈ చిన్న జట్టు సంచలనాలు సృష్టిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. అందుకు తగ్గతే.. శుక్రవారం పాకిస్థాన్ తో జరిగిన వరల్డ్ కప్ సన్నాహక మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్‌ 47.5 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. బాబర్‌ అజామ్‌ (112; 108 బంతుల్లో 10×4, 2×6) సెంచరీ సాధించగా.. షోయబ్‌ మాలిక్‌ (44) రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో మహ్మద్‌ నబి (3/46), రషీద్‌ ఖాన్‌  (2/27), దవ్లత్‌ జద్రాన్‌ (2/37) కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు 49.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. హస్మతుల్లా షాహిది (74 నాటౌట్‌; 102 బంతుల్లో 7×4) అఫ్గాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. జజాయ్‌ (49), మహ్మద్‌ నబి (34), రెహమత్‌ షా (32) రాణించారు.