చెరువును తలపిస్తున్న ఇంగ్లండ్‌ క్రికెట్ గ్రౌండ్!

ఐసీసీ వరల్డ్ కప్ 2019 నేపథ్యంలో ఇంగ్లండ్‌లో వర్షాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వర్షాలను క్రికెట్‌కు లింక్ పెడుతూ సోషల్ మీడియాలో అనేక కథనాలు, జోకులు పుట్టుకొస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దవుతున్నాయి. ఎంతో ఆసక్తిగా చూడాలనుకునే వరల్డ్ కప్ మ్యాచ్‌లకు వర్షాలు అడ్డు రావడంతో ఈ సారి సరైన కిక్కులేదంటున్నారు క్రికెట్ అభిమానులు. ఇటీవల ఇండియా-పాక్ మ్యాచ్ కూడా ‘వర్షం’లో చిక్కుకుంది. అయితే, డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ కొనసాగడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. […]

చెరువును తలపిస్తున్న ఇంగ్లండ్‌ క్రికెట్ గ్రౌండ్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 20, 2019 | 5:07 PM

ఐసీసీ వరల్డ్ కప్ 2019 నేపథ్యంలో ఇంగ్లండ్‌లో వర్షాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వర్షాలను క్రికెట్‌కు లింక్ పెడుతూ సోషల్ మీడియాలో అనేక కథనాలు, జోకులు పుట్టుకొస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దవుతున్నాయి. ఎంతో ఆసక్తిగా చూడాలనుకునే వరల్డ్ కప్ మ్యాచ్‌లకు వర్షాలు అడ్డు రావడంతో ఈ సారి సరైన కిక్కులేదంటున్నారు క్రికెట్ అభిమానులు. ఇటీవల ఇండియా-పాక్ మ్యాచ్ కూడా ‘వర్షం’లో చిక్కుకుంది. అయితే, డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ కొనసాగడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంగ్లాండ్‌లో వర్షాలకు అక్కడ క్రీడా మైదానాలు చెరువుల్లా మారిపోతున్నాయి. ఇందుకు పైఫొటోనే నిదర్శనం. వెయిన్‌ఫ్లీట్‌లో భారీ వర్షాల వల్ల వరదలు ముంచెత్తాయి. దీంతో స్థానిక కౌంటీ క్రికెట్ గ్రౌండ్ చెరువును తలపిస్తోంది. రానున్న 24 గంటల్లో అక్కడ మరిన్ని వర్షాలు కురవనున్నాట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ జాబితాలో ఈ క్రికెట్ గ్రౌండ్ లేదు. దీంతో అక్కడ మ్యాచ్‌లు కూడా లేవు. ఏది ఏమైనా వరల్డ్ కప్‌కు మాత్రం వరుణ దేవుడు పెద్ద పరీక్ష పెడుతున్నాడు.