ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లో ఆరెంజ్‌ జెర్సీలతో టీమిండియా?

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా జూన్‌ 30న ఆతిథ్య జట్టుతో టీమిండియా తలపడనుంది. ఆతిథ్య జట్టు తప్ప‌ మిగతా అన్నింటికీ రెండు వేర్వేరు రంగుల జెర్సీలకు అనుమతినిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు బ్లూ కలర్‌ జెర్సీకి బదులు నారింజ(ఆరెంజ్‌) రంగు జెర్సీలతో బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు జూన్‌ 2న బంగ్లాదేశ్‌తో ఆడిన రెండో మ్యాచ్‌లోనే ఆకు పచ్చ జెర్సీకి బదులు పసుపు […]

ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లో ఆరెంజ్‌ జెర్సీలతో టీమిండియా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 20, 2019 | 4:39 PM

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా జూన్‌ 30న ఆతిథ్య జట్టుతో టీమిండియా తలపడనుంది. ఆతిథ్య జట్టు తప్ప‌ మిగతా అన్నింటికీ రెండు వేర్వేరు రంగుల జెర్సీలకు అనుమతినిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు బ్లూ కలర్‌ జెర్సీకి బదులు నారింజ(ఆరెంజ్‌) రంగు జెర్సీలతో బరిలోకి దిగనున్నారు.

ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు జూన్‌ 2న బంగ్లాదేశ్‌తో ఆడిన రెండో మ్యాచ్‌లోనే ఆకు పచ్చ జెర్సీకి బదులు పసుపు పచ్చ జెర్సీని ధరించారు. అలాగే బంగ్లా ఆటగాళ్లు సైతం తమ జెర్సీల్లో ఎరుపు రంగును జోడించి ధరించారు. ఈ క్రమంలో అఫ్గాన్‌ జట్టు సైతం శనివారం భారత్‌తో తలపడే మ్యాచ్‌లో వేరే రంగు జెర్సీలను ధరించే అవకాశముంది.