Video: 2009 ‘దిల్ స్కూప్’ షాట్.. 2023లో సేమ్ టూ సేమ్ దించేసిన ప్లేయర్.. వీడియో చూస్తే ఔరా అనాల్సిందే..
ICC Women's T20 World Cup 2023: మహిళల టీ20 ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్ శ్రీలంక వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్ దిల్ స్కూప్ షాట్ ఆడి అందరి హృదయాలను గెలుచుకుంది.
ICC Women’s T20 World Cup 2023: మహిళల టీ20 ప్రపంచ కప్ 2023 ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 10, శుక్రవారం శ్రీలంక వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక తరపున ఆడిన హర్షిత మాదవి.. శ్రీలంక పురుషుల జట్టు మాజీ ఆటగాడు తిలకరత్నే దిల్షాన్‌ను గుర్తు చేసింది. అతను దక్షిణాఫ్రికాతో ఆడిన మొదటి మ్యాచ్‌లో దిల్షాన్ లాగానే దిల్ స్కూప్ షాట్ ఆడింది. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
తిలకరత్నే దిల్షాన్‌ను అచ్చు గుద్దేసిందిగా..
ఐసీసీ ఈ వీడియోలో దిల్షాన్, హర్షిత ఇద్దరి వీడియోలను పక్కపక్కనే ఉంచింది. ఇందులో, దిల్షాన్ వీడియో మొదట చూపించింది. అందులో అతను మాజీ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్‌పై దిల్ స్కూప్ షాట్ కొట్టడం కనిపిస్తుంది. దిల్షాన్ 2009 మ్యాచ్‌లో ఈ షాట్ ఆడాడు.
ఆ తరువాత, హర్షిత మాదవి వీడియో ప్లే అవుతుంది. మాదవి సరిగ్గా దిల్షాన్‌ను దించేసింది. ఈ షాట్‌లో, అభిమానులు దిల్షాన్ ఆటను గుర్తుకుచేసుకుంటారనడంలో సందేహం లేదు. ఆ తరువాత, ఇద్దరి వీడియో కలిసి ప్లే అవుతుంది. ఇందులో దిల్షాన్, హర్షిత షాట్‌ల మధ్య తేడా లేదు. ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ అయాబొంగా ఖాకా బంతికి హర్షిత ఈ షాట్ ఆడింది.
View this post on Instagram
మూడు పరుగుల తేడాతో విజయం..
ఈ మ్యాచ్‌లో శ్రీలంక మహిళల జట్టు 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ చమరి అటపట్టు 50 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 68 పరుగులు చేసింది. పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..