LSG vs MI Prediction Playing XI IPL 2022: మొదటి విజయం కోసం ముంబై ఆరాటం.. జట్టులో పలు మార్పులు.. లక్నోతో పోరుకు సిద్ధం..

Lucknow Super Giants vs Mumbai Indians Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఈ టోర్నీలో మాత్రం

LSG vs MI Prediction Playing XI IPL 2022: మొదటి విజయం కోసం ముంబై ఆరాటం.. జట్టులో పలు మార్పులు.. లక్నోతో పోరుకు సిద్ధం..
Lsg Vs Mi
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 24, 2022 | 9:33 AM

Lucknow Super Giants vs Mumbai Indians Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఈ టోర్నీలో మాత్రం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన ఆ జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే. అయితే వరుస పరాజయాలకు స్వస్తి పలికి పరువు దక్కించుకోవాలని రోహిత్‌ సేన భావిస్తోంది. ఈక్రమంలో ఆదివారం (ఏప్రిల్‌24) బలమైన లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants) తో తలపడనుంది. కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని లక్నో జట్టు ఈ సీజన్‌లో బాగా ఆడుతోంది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అయితే ఆ జట్టు తన చివరి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో ముంబై గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని లక్నో భావిస్తోంది. కాగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్‌ (LSG vs MI) ప్రారంభమవుతుంది.

వారు డగౌట్ కే..

ఈ సీజన్‌లో ముంబైకి ఏదీ కలిసి రావడం లేదు. రోహిత్ శర్మ ఫామ్ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇషాన్‌ కిషన్‌, కీరన్ పొలార్డ్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. బౌలింగ్‌లో బుమ్రా ఒంటరిగా పోరాడుతున్నాడు. అందుకే ఈ మ్యాచ్లో పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చిన ఉనాద్కత్ పెవిలియన్‌కే పరిమితం కావొచ్చు. అతని స్థానంలో మరోసారి బాసిల్ థంపి జట్టులోకి రావొచ్చు. హృతిక్ షౌకిన్‌కు మరో అవకాశం ఇవ్వొచ్చు.

వోహ్రాకు ఛాన్స్!

ఇక లక్నో విషయానికొస్తే.. బ్యాటింగ్‌, బౌలింగ్‌లలో ఆ జట్టు బలంగానే కనిపిస్తోంది. అయితే వన్‌డౌన్‌ బ్యాటర్‌ మనీష్ పాండే ఫామ్‌ టీం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. అతని స్థానంలో కృష్ణప్ప గౌతమ్‌కు అవకాశమిచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈక్రమంలో అతని స్థానంలో మనన్ వోహ్రాకు అవకాశం లభించవచ్చు. ఇది తప్ప తుది జట్టులో పెద్దగా మార్పులేమీ కనిపించకపోవచ్చు.

ఇరు జట్ల ప్లేయింగ్- XI ఎలా ఉండొచ్చంటే..

లక్నో సూపర్ జెయింట్స్ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, మనన్ వోహ్రా, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, క్రునాస్ పాండ్యా, జాసన్ హోల్డర్, దుష్మంత చమీరా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, హృతిక్ షోకిన్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్.

టీవీ9లో నిరంతరం అప్‌డేట్స్‌..

కాగా ముంబై, లక్నోల మధ్య జరిగే మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషలలో చూడవచ్చు. అదేవిధంగా డిస్నీ+హాట్‌స్టార్‌లో సబ్‌స్ర్కిప్షన్‌తో వీక్షించొచ్చు. వీటితో పాటు https://tv9telugu.com/ ద్వారా ఎప్పటికప్పుడు మ్యాచ్‌ అప్‌డేట్స్‌ను తెలుసుకోవచ్చు.

Also Read: RCB vs SRH: 68 పరుగులకే కుప్పకూలిన బెంగుళూరు.. సునాయసనంగా గెలిచిన హైదరాబాద్..

Digital News Round Up: పవన్‌ టూర్‌ లో జగన్‌ భజన || టీ తాగడం కోసం ట్రైన్ ఆపిన డ్రైవర్..లైవ్ వీడియో

Rashmi Gautam: కవ్వించే సోయగాల కలువ కళ్ళ సుందరి.. రష్మి గౌతమ్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?