AUS vs SA T20 World Cup 2021 Match Prediction: దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలిపోరు.. ఎవరి బలాలు ఎలా ఉన్నాయంటే?

Today Match Prediction of Australia vs South Africa: దక్షిణాఫ్రికా తన చివరి 10 మ్యాచ్‌లలో తొమ్మిది గెలిచింది. ఆస్ట్రేలియా తమ చివరి 10 మ్యాచుల్లో 8 ఓడిపోయింది. అలాగే నాలుగు టీ 20 సిరీస్‌లను కోల్పోయింది.

AUS vs SA T20 World Cup 2021 Match Prediction: దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలిపోరు.. ఎవరి బలాలు ఎలా ఉన్నాయంటే?
T20 Worl Cup 2021, Aus Vs Sa
Follow us

|

Updated on: Oct 23, 2021 | 7:51 AM

AUS vs SA T20 World Cup 2021, Playing XI, Players to Watch Out: టీ 20 ప్రపంచ కప్ 2021లో అసలు సమరం నేటి నుంచి మొదలుకానుంది. తొలి మ్యాచులో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా టీంల మధ్య కీలకపోరుతో పొట్టి ప్రపంచకప్‌ సందడి మొదలుకానుంది. అయితే టీ20 వరల్డ్ కప్‌లో ఇరు జట్లకు గొప్ప రికార్డులేమీ లేవు. అయితే ఇప్పటి వరకు జరిగిన టీ20 ప్రపంచకప్‌లలో ఒక్కసారి కూడా ఈ రెండు జట్లు ట్రోఫీని గెలుచుకోలేదు. దీంతో ఈసారి ఎలాగైనా ట్రోఫీ దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాయి.

ఇటీవలి ఫామ్, ఐసీసీ టీ20 ర్యాంకింగ్‌లను గమనిస్తే దక్షిణాఫ్రికా టీం 5వ స్థానం, ఆస్ట్రేలియా టీం 9వ స్థానంలో ఉన్నాయి. దక్షిణాఫ్రికా జట్టు చివరిసారిగా ఆడిన 10 మ్యాచ్‌లలో తొమ్మిదింట్లో విజయం సాధించింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లతో జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌లలోనూ ఆకట్టుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా తమ చివరి 10 టీ 20 ల్లో ఎనిమిది మ్యాచుల్లో ఓటమిపాలైంది. అలాగే చివరి నాలుగు సిరీస్‌లను కోల్పోయింది. ఇక వార్మప్‌ మ్యాచ్‌ల విషయానికి వస్తే తొలి గేమ్‌లో న్యూజిలాండ్‌ని ఓడించింది. రెండో మ్యాచ్‌లో భారత్ చేతిలో చిత్తయింది.

కానీ, ఆస్ట్రేలియా టీం దక్షిణాఫ్రికాపై ఇటీవల ఒక మంచి రికార్డును కలిగి ఉంది. 2020 లో ఇరుజట్ల మధ్య జరిగిన చివరి సిరీస్‌ను ఆసీస్‌ గెలుచుకుంది. ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ ఫాంతో తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇద్దరూ పరుగులు సాధించేందుకు తెగ కష్టపడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచులలో వీరిద్దరూ తొలి రెండు, మూడో ఓవర్లలోనే పెవిలియన్ చేరడంతో జట్టుకు చాలా భారంగా మారిపోయారు.

ప్రస్తుత టీ 20‌ల్లో నంబర్ 1 బౌలర్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన తబ్రేజ్ శామ్సీ, ఆస్ట్రేలియా టీంను తన స్పిన్‌తో సవాలు చేసేందుకు సిద్ధమయ్యాడు.

చివరిగా ఆడిన ఐదు మ్యాచుల వివరాలు: ఆస్ట్రేలియా: ఓటమి, విజయం, ఓటమి, ఓటమి, ఓటమి దక్షిణాఫ్రికా: విజయం, విజయం, విజయం, విజయం, విజయం

ఎప్పుడు: ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా, సూపర్ 12 గ్రూప్ 1, అక్టోబర్ 23న, మధ్యాహ్నం 03:30 గంటలకు

ఎక్కడ: షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి

లైవ్: స్టార్‌స్పోర్ట్స్‌, డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లోనూ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.

ఈ ఏడాది డేవిడ్ వార్నర్‌ బ్యాట్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. పరుగులు రాబట్టేందుకు చాలా కష్టాలు పడుతోంది. దీంతో అతనిపై చాలా ఒత్తిడి నెలకొంది. యూఏఈలో ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో 0, 2, 0, 1 స్కోర్‌లకే పెవిలియన్ చేరాడు. అయితే, టీం మేనేజ్‌మెంట్ మాత్రం డేవిడ్ వార్నర్ టోర్నమెంట్‌లో మంచిగా రానిస్తాడని ఆశిస్తోంది. కానీ, వారి నమ్మకాన్ని కాపాడలేకపోతున్నాడు. అయితే టీ20 ప్రపంచ కప్‌లో మాత్రం గొప్ప రికార్డును కలిగిఉన్నాడు. డేవిడ్ వార్నర్ 23 ఇన్నింగ్స్‌లలో కేవలం మూడు అర్ధ సెంచరీలతో కేవలం 129 పరుగులు చేశాడు. అయితే వార్నర్ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచుల్లో మాత్రం ఇతర దేశాల ప్లేయర్ల కంటే ఎక్కువగా పరుగులు సాధిస్తుంటాడు.

2021లో ఇప్పటివరకు 28 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ శామ్సీ.. ఓ క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిని బౌలర్‌గా రికార్డు సాధించేందుకు కేవలం నాలుగు వికెట్ల దూరంలో నిలిచాడు. ఈ ఏడాది ప్రారంభంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో ఏడు వికెట్లతో ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. అలాగే 4.0 ఎకానమీ రేటుతో పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ ఈ ప్రపంచ కప్‌లో ప్రత్యర్థి జట్లకు సవాలు విసురేందుకు సిద్ధమయ్యాడు. మిడిల్ ఓవర్లలో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించే అవకాశాలు ఉన్నాయి.

పిచ్ రిపోర్ట్: అబుదాబి పిచ్ ఫ్లడ్ లైట్ల కింద కంటే పగటిపూట విభిన్నమైన సవాలును విసరనుంది. 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో ఎంతో హాట్‌గా ఉండనుంది. అయితే వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు జట్లు విజయవంతంగా ఛేజ్ చేశాయి. ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచుల్లో మూడింట్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. అయితే 2021 లో అబుదాబిలో జరిగిన అన్ని టీ 20 ల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది.

అబుదాబి పిచ్ బ్యాట్స్‌మెన్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బ్యాటింగ్ చేయడానికి పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. అయితే ఇక్కడ మూడు బౌండరీ లైన్‌లు దుబాయ్, షార్జా కంటే చాలా పెద్దవిగా ఉన్నాయి. ఈ మైదానంలో స్పిన్నర్లకు పెద్దగా సహాయం లభించదు. వారి సగటు ఒక్కో వికెట్‌కు 33 పరుగులు ఇవ్వగా, ఫాస్ట్ బౌలర్ల సగటు ప్రతి వికెట్‌కు 29 పరుగులుగా ఉంది.

రాత్రి మ్యాచ్‌లలో ఎక్కువ మంచు కురుస్తుంది. కాబట్టి మధ్యాహ్నం మ్యాచ్‌లు, సాయంత్రం మ్యాచ్‌లు చాలా భిన్నంగా ఉంటాయి. మంచుతో కూడిన రాత్రి మ్యాచ్‌లో అధిక స్కోర్‌లను ఛేజ్ చేస్తున్న జట్లకు అనుకూలంగా ఉంటాయి. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ మూడు మ్యాచ్‌లు ఆడనుంది. అందులో రెండు మ్యాచ్‌లు మధ్యాహ్నం జరగనున్నాయి.

టీం న్యూస్: అదనపు ఓవర్లు వేయడానికి గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్‌తో ఆస్ట్రేలియా ఏడుగురు బ్యాట్స్‌మెన్స్, నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతుందని ఆరోన్ ఫించ్ ధృవీకరించాడు. అంటే పాట్ కమిన్స్, జోష్ హాజెల్‌వుడ్ లేదా కేన్ రిచర్డ్‌సన్‌లో ఒకరికి మాత్రమే ప్లేయింగ్ XIలో చోటు దక్కనుంది.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: 1. ఆరోన్ ఫించ్ (కెప్టెన్), 2 . డేవిడ్ వార్నర్, 3. మిచెల్ మార్ష్, 4. గ్లెన్ మాక్స్‌వెల్, 5. స్టీవెన్ స్మిత్, 6. మార్కస్ స్టోయినిస్, 7. మాథ్యూ వేడ్, 8. అష్టన్ అగర్, 9. మిచెల్ స్టార్క్, 10. ఆడమ్ జాంపా, 11. జోష్ హాజెల్‌వుడ్

దక్షిణాఫ్రికా టీం స్పిన్‌తో ప్రత్యర్థులకు సవాలు విసురుతోంది. షమ్సీ ఎంతో ఫిట్‌గా ఉన్నాడు. రాసీ వాన్ డెర్ డస్సేన్ పాకిస్తాన్‌పై 3 వ స్థానంలో వచ్చి సెంచరీ చేసినా.. కానీ, మిడిల్ ఓవర్లలో అతని అత్యుత్తమ ప్రదర్శన మేరకు ఆస్ట్రేలియాపై 4 వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నట్లు తెలిపారు.

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: 1. క్వింటన్ డి కాక్ (కీపర్), 2. టెంబా బావుమా (కెప్టెన్), 3. ఏడెన్ మార్క్రామ్, 4. రాసీ వాన్ డెర్ డసెన్, 5. డేవిడ్ మిల్లర్, 6. హెన్రిచ్ క్లాసెన్, 7. వియాన్ ముల్డర్, 8. కగిసో రబాడా, 9. కేశవ్ మహారాజ్, 10. అన్రిచ్ నార్ట్జే/లుంగీ న్గిడి, 11. తబరైజ్ షమ్సి

ఇరుజట్ల మధ్య ముఖాముఖి పోరులో విజేతలు: 50 ఓవర్ల ప్రపంచ కప్‌లో ఈ రెండు జట్లకు గొప్ప చరిత్ర ఉంది. టీ 20 ప్రపంచ కప్‌‌లో మాత్రం ఇరుజట్లు ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. 2012లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియానే సునాయాస విజయం సాధించింది. అయితే చివరిసారి తలపడిన ఐదు మ్యాచులను పిరిశీలిస్తే ఆస్ట్రేలియా 3, దక్షిణాఫ్రికా 2 మ్యాచుల్లో విజయం సాధించాయి.

ఆకట్టుకునే ఆటగాళ్లు: 2020 ప్రారంభం నుంచి దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబరైజ్ షమ్సీ టీ20 క్రికెట్‌లో ఇతర దేశాల స్పిన్నర్లతో పోల్చితే అత్యధిక వికెట్లు(37) తీశాడు. ఆ తరువాతి స్థానంలో అష్టన్ అగర్ (25), ఆడమ్ జంపా (24) నిలిచారు.

ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్‌వెల్ ఎంతో కీలకం కానున్నాడు. ఐపీఎల్ 2021లో అద్భుతంగా రాణించి ఆకట్టుకున్నాడు. అయితే కాగిసో రబాడా, మాక్స్‌వెల్‌కు మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. వీరిద్దరి మధ్య జరిగిన టీ 20 పోటీల్లో 27 బంతుల్లో మూడుసార్లు మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేశాడు. అలాగే 2019లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్‌లో కూడా మాక్స్‌వెల్‌ని బౌన్స్‌తో తెగ ఇబ్బంది పెట్టాడు.

అలాగే ఆస్ట్రేలియా నుంచి మిచెల్ మార్ష్, మ్యాథ్యూ వాడే, జోష్ హజల్ వుడ్, ఆడం జంపా, దక్షిణాఫ్రికా టీం నుంచి క్వింటన్ డికాక్, రీజా హెన్‌డ్రిక్స్ ఆకట్టుకునే లిస్టులో ఉన్నారు.

మీకు తెలుసా: – టీ 20 ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా టీంల గెలుపోటముల రికార్డు ఒకేలా ఉంది. 29 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా 16 గెలిచి, 13 ఓడింది. దక్షిణాఫ్రికా టీం 30 మ్యాచ్‌లలో 18 గెలిచి, 12 ఓడిపోయింది.

– దక్షిణాఫ్రికాతో జరిగిన 14 టీ 20 ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ సగటు 35.15గా ఉంది. అలాగే 148.86 స్ట్రైక్‌రేట్‌తో 457 పరుగులు సాధించాడు.

– తబ్రైజ్ షమ్సీ ఈ ఏడాది 17 టీ 20 ల్లో 28 వికెట్లు తీశాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే ఓ క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా నిలవనున్నాడు.

స్క్వాడ్స్‌: ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (కీపర్), అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జాంపా, జోష్ హాజెల్‌వుడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్వీప్సన్, కేన్ రిచర్డ్సన్ , జోష్ ఇంగ్లిస్

దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్ (కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, రాసీ వాన్ డెర్ డ్యూసెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే, లుంగీ న్గిడి, తబ్రేజ్ షమ్సి, బి. ఫోర్టిన్, రీజా హెండ్రిక్స్, డ్వైన్ ప్రిటోరియస్

Also Read: T20 World Cup: టీ 20 ప్రపంచకప్‌తో అరంగేట్రం చేసిన టీమిండియా క్రికెటర్లు.. ప్రస్తుత టీంలో ఎంతమంది ఉన్నారో తెలుసా?

T20 World Cup: భారత్-పాక్ మ్యాచ్‌కు ముందు షాకిచ్చిన బీసీసీఐ.. స్వదేశానికి చేరిన ఆ నలుగురు ఆటగాళ్లు.. ఎందుకో తెలుసా?