AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: ఐర్లాండ్ కు షాక్ ఇచ్చి విజయం సొంతం చేసుకుని టీ 20 వరల్డ్ కప్ సూపర్ 12 దశకు చేరుకున్న నమీబియా

T20 World Cup: ప్రపంచ పొట్టి క్రికెట్ పోటీలు నేటి నుంచి షురూ కానున్నాయి. అయితే ఈసారి టీ 20 వరల్డ్ కప్ 2021లో ఓ దేశం చరిత్ర సృష్టించింది. తాను..

T20 World Cup: ఐర్లాండ్ కు షాక్ ఇచ్చి విజయం సొంతం చేసుకుని టీ 20 వరల్డ్ కప్ సూపర్ 12 దశకు చేరుకున్న నమీబియా
Namibia
Surya Kala
|

Updated on: Oct 23, 2021 | 7:42 AM

Share

T20 World Cup: ప్రపంచ పొట్టి క్రికెట్ పోటీలు నేటి నుంచి షురూ కానున్నాయి. అయితే ఈసారి టీ 20 వరల్డ్ కప్ 2021లో ఓ దేశం చరిత్ర సృష్టించింది. తాను ఆడుతున్న తొలి టీ20 ప్రపంచకప్‌లోనే సూపర్‌ 12 దశకు అర్హత సాధించింది. గ్రూప్-ఏలో భాగంగా షార్జాలో తలపడి.. నిలబడి.. అద్భుతంగా పోరాడి.. విజయం సొంతం చేసుకుని సూపర్ 12 దశకు చేరుకుంది. ఆ దేశం నమీబియా.

షార్జా వేదికగా గ్రూప్ ఏ నుంచి ఐర్లాండ్, నమీబియా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి ఐర్లాండ్ మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఎంచుకుంది. అయితే ఐర్లాండ్ బ్యాటింగ్ లో తడబడింది. నమీబియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. ఐర్లాండ్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకట్టవేసింది. ఐర్లాండ్ బ్యాట్స్ మెన్ లో ఓపెనర్లు స్టిర్లింగ్ , కెవిన్ ఓబ్రియాన్, కెప్టెన్ బాల్ బిర్నీ లు మాత్రమే నమియా బౌలర్లను ఎదుర్కొన్నారు. మిగిలిన ఆటగాళ్లు విఫలం కావడంతో ఐర్లాండ్ 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి.. కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. నమీబియా బౌలర్లలో జాన్ ఫ్రైలింక్ 3, వీజ్ 2 వికెట్లు, స్మిట్, స్కోల్జ్ తలో వికెట్ తీసి.. ఐర్లాండ్ భారీ స్కోర్ ఆశలపై నీరు చల్లారు.

126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా జట్టు తడబాటు లేకుండా ఆడుతూపాడుతూ లక్ష్యఛేదన చేసింది. 18.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. నమీబియా ఓపెనర్లు క్రెగ్ విలియమ్స్ 15, జేన్ గ్రీన్ 24 పరుగులు చేసి ఔట్ అయ్యారు. థర్డ్ మెన్ గా బరిలోకి దిగిన నమీబియా జట్టు కెప్టెన్‌ ఎరాస్మస్‌ 53 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. చివర్లో డేవిడ్‌ వీస్‌(28 నాటౌట్) తన మెరుపు బ్యాటింగ్ తో అలరించాడు. దీంతో కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఐర్లాండ్ పై నమీబియా విక్టరీని సొంతం చేసుకుంది. ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ కాంఫర్ 2 వికెట్లు తీశాడు.

నమీబియా టీ20 ప్రపంచకప్‌ లో తొలిమ్యాచ్ ను శ్రీలంకతో తలబడింది. ఓటమితో సిరీస్ ను ప్రారభించింది. తర్వాత మ్యాచ్ లో నెదర్లాండ్స్‌కు షాక్‌ ఇస్తూ నమీబియా అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సూపర్ 12 కు చేరుకోవాలంటే ఐర్లాండ్ తో విజయం కీలకంగా మారింది. దీంతో ఐర్లాండ్ పై ఒత్తిడి లేకుండా.. ప్రణాళిక ప్రకారం ఆడి తక్కువ స్కోర్ కే కట్టడి చేసి.. బ్యాటింగ్ లో ప్రతిభ కనబరిచింది. సూపర్‌ 12కు అర్హత సాధించింది. ఈ విషయం తెలియగానే నమీబీయా ఆటగాళ్లు హర్షం వ్యక్తం చేశారు.

Also Read:  నేడు డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు.. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఫ్యాన్స్..