Vaibhav Suryavanshi : 30 రోజుల్లో ఏడు భారీ ఇన్నింగ్స్‌లు..స్టార్ బౌలర్ సైతం అవాక్కయ్యే రేంజ్‌లో వైభవ్ బ్యాటింగ్
Vaibhav Suryavanshi :సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా.. రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ప్లేయర్లను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

Vaibhav Suryavanshi : ప్రపంచ క్రికెట్‌లో ఓ సరికొత్త సంచలనం పుట్టుకొచ్చింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే దిగ్గజ క్రికెటర్లను సైతం నోరెళ్లబెట్టేలా చేస్తున్నాడు బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ వండర్ బాయ్, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా.. రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ప్లేయర్లను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
టీమిండియా వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ సాధారణంగా ఎవరినీ అంత త్వరగా మెచ్చుకోరు. కానీ వైభవ్ సూర్యవంశీ విషయంలో ఆయన అవాక్కయ్యారు. గత 30 రోజుల్లో వైభవ్ సాధించిన స్కోర్లను అశ్విన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.. 171(95), 50(26), 190(84), 68(24), 108(61), 46(25), నేడు 127(74). ఈ గణాంకాలను చూపిస్తూ అశ్విన్.. “ఏమిటిది భాయ్? ఈ శాంపిల్స్ సరిపోతాయా లేక ఇంకా లెవల్ పెంచబోతున్నావా?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం 14 ఏళ్ల వయసులో ఈ తరహా నిలకడ, విధ్వంసం అసాధ్యమని ఆయన కొనియాడారు.
సౌతాఫ్రికా అండర్-19 తో జరిగిన మూడు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌లో వైభవ్ అదరగొట్టాడు. మూడో వన్డేలో అద్భుత సెంచరీతో జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో వైభవ్ ఏకంగా 187.27 స్ట్రైక్ రేట్‌తో 206 పరుగులు చేశాడు. ఇందులో విశేషం ఏంటంటే.. అతను కేవలం 12 ఫోర్లు, ఏకంగా 20 సిక్సర్లు బాదాడు. బౌలర్ ఎవరైనా సరే బంతిని గాల్లోకి పంపడమే లక్ష్యంగా వైభవ్ బ్యాటింగ్ సాగింది.
అశ్విన్ తన పోస్ట్‌లో మరో కీలక విషయాన్ని ప్రస్తావించారు. త్వరలో జరగబోయే అండర్-19 వరల్డ్ కప్‌లో అందరి కళ్ళు వైభవ్ మీదనే ఉంటాయని, ఆ తర్వాత ఐపీఎల్‌లో అతను రాజస్థాన్ రాయల్స్ తరపున ఓపెనింగ్‌లో సంజూ శాంసన్ స్థానాన్ని కూడా భర్తీ చేసే అవకాశం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఈ 14 ఏళ్ల కుర్రాడి ఆకలి, క్యారెక్టర్, దూకుడు వచ్చే నాలుగు నెలల్లో భారత క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చేస్తాయని అశ్విన్ జోస్యం చెప్పారు.
యూత్ వన్డేలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అతని వయసు మీద కొన్ని వివాదాలు నడిచినప్పటికీ, మైదానంలో అతను చూపిస్తున్న టాలెంటును మాత్రం ఎవరూ కాదనలేకపోతున్నారు. ఒక ప్రొఫెషనల్ బ్యాటర్ లాగా బంతిని బాదడం, మైదానం నలుమూలలా షాట్లు ఆడడం చూస్తుంటే భారత క్రికెట్‌కు మరో పవర్‌ఫుల్ ఓపెనర్ దొరికాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
