ఉప్పల్‌లో ఊహించని ఎంట్రీ.. తొలి ఓవర్‌లోనే బిగ్ షాక్.. అసలెవరీ హైదరాబాద్ సర్‌ప్రైజ్ వెపన్?
ప్రస్తుతం పంజాజ్ కింగ్స్ జట్టు 12 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. శ్రేయాస్ 48, వధేరా 17 పరుగులతో క్రీజులో నిలిచారు. ప్రియాంష్ ఆర్య 36, ప్రభుమన్ సిమ్రాన్ 42 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. హైదరాబాద్ జట్టు తరపున హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ్ తలో వికెట్ పడగొట్టారు.

Eshan Malinga: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఐదవ గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఉప్పల్ ఉపరితల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని బ్యాటింగ్ తీసుకుంటున్నట్లు తెలిపాడు. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక మార్పులో బరిలోకి దిగింది.
ఎషాన్ మలింగ గణాంకాలు..
పంజాజ్‌తో జరుగుతోన్న ఐపీఎల్ 2025 మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ మైదరాబాద్ జట్టు ఎషాన్ మలింగను తమ ప్లేయింగ్ XIలోకి తీసుకుంది. ఈ 24 ఏళ్ల ఈ యువకుడు శ్రీలంకకు చెందిన కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్. అతను అసాధారణ బౌలింగ్ నైపుణ్యాలకు పేరుగాంచాడు.
ఎషాన్ మలింగ 16 టీ20 మ్యాచ్‌లు ఆడి, 22.82 సగటు, 17.7 స్ట్రైక్ రేట్‌తో 17 వికెట్లు పడగొట్టాడు. అతని 7.70 ఎకానమీతో పరుగులు ఇస్తున్నాడు.
MAIDEN IPL WICKET FOR ESHAN MALINGA!
Sunriseres Hyderabad crowd went berserk after Prabhsimran wicket, Kavya Maran also seems happy. #IPL2025 #SRHvsPBKS #BCCI #T20Cricket #IndianCricket #EshanMalinga #PrabhsimranSingh pic.twitter.com/TC8gmUT3iX
— vinaygupta(modi ka parivaar) 🇮🇳 (@VinayGu27264503) April 12, 2025
SA20 2025లో, మలింగ 3 ఇన్నింగ్స్‌లలో 18 స్ట్రైక్ రేట్‌తో నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఈ లంక స్పీడ్‌స్టర్ తన దేశ సహచరుడు, శ్రీలంక ఆల్ రౌండర్ కమిందు మెండిస్ స్థానంలో సన్‌రైజర్స్ ప్లేయింగ్ XIలో చేరాడు.
ఎస్‌ఆర్‌హెచ్ తమ ప్లేయింగ్ 11లో మరో మార్పు చేసింది. జయదేవ్ ఉనద్కత్ స్థానంలో బౌలింగ్ ఆల్ రౌండర్ హర్షల్ పటేల్‌ను నియమించింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ గత మ్యాచ్‌లో ఆడిన ప్లేయింగ్ XIతోనే బరిలోకి దిగింది.
ప్రస్తుతం పంజాజ్ కింగ్స్ జట్టు 12 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. శ్రేయాస్ 48, వధేరా 17 పరుగులతో క్రీజులో నిలిచారు. ప్రియాంష్ ఆర్య 36, ప్రభుమన్ సిమ్రాన్ 42 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. హైదరాబాద్ జట్టు తరపున హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ్ తలో వికెట్ పడగొట్టారు.
SRH vs PBKS జట్ల ప్లేయింగ్ XIలు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ.
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..