8 సిక్స్‌లు, 10 ఫోర్లతో మార్క్రామ్, పూరన్‌ల ఊచకోత.. ఒక్క విజయంతో పాయింట్ల పట్టికనే షేక్ చేసిన పంత్ సేన
Lucknow Super Giants vs Gujarat Titans, 26th Match Result: లక్నో సూపర్ జెయింట్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో జట్టు 20వ ఓవర్లో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

Lucknow Super Giants vs Gujarat Titans, 26th Match Result: లక్నో సూపర్ జెయింట్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో జట్టు 20వ ఓవర్లో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నికోలస్ పూరన్ 61, ఐడెన్ మార్క్రామ్ 58 పరుగులు చేశారు. శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ చెరో 2 వికెట్లు తీశారు.
గుజరాత్ తరఫున సాయి సుదర్శన్ 58 పరుగులు, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ 60 పరుగులు చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశాడు. లక్నో 6 మ్యాచ్‌ల్లో నాలుగో విజయం సాధించింది. వరుసగా నాలుగు విజయాల తర్వాత గుజరాత్ మ్యాచ్‌లో ఓడిపోయింది. రెండు జట్లు తలో 8 పాయింట్లతో 2వ, 3వ స్థానాల్లో నిలిచాయి.
ఇరు జట్లు:
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్/కీపర్), హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.
రెండు జట్లకు ఇంపాక్ట్ ప్లేయర్లు:
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: ప్రసిద్ధ్ కృష్ణ, మహిపాల్ లోమ్రోర్, నిశాంత్ సింధు, అనుజ్ రావత్, జయంత్ యాదవ్.
లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు: ఆయుష్ బదోని, ప్రిన్స్ యాదవ్, షాబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రీట్జ్కే, షమర్ జోసెఫ్.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..