AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG T20I: తొలి విజయంతో దూకుడు పెంచిన భారత్.. రెండో T20I ఎప్పుడు? ఎక్కడ? పూర్తి వివరాలు మీకోసం..

India vs Afghanistan 2nd T20I: కెప్టెన్ రోహిత్ శర్మ 14 నెలల తర్వాత తొలి టీ20లో విజయం సాధించడం ద్వారా అంతర్జాతీయ టీ20ఐ ఫార్మాట్‌లోకి తిరిగి వచ్చాడు. తొలి విజయంతో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు రెండో మ్యాచ్‌కి ఇరు జట్లు సన్నద్ధం కావాల్సి ఉంది. మరి ఇండో-ఆఫ్గాన్ రెండో టీ20 మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ? ప్రత్యక్ష ప్రసారం ఎలా చూడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

IND vs AFG T20I: తొలి విజయంతో దూకుడు పెంచిన భారత్.. రెండో T20I ఎప్పుడు? ఎక్కడ? పూర్తి వివరాలు మీకోసం..
Ind Vs Afg 2nd T20i
Venkata Chari
|

Updated on: Jan 12, 2024 | 4:02 PM

Share

IND vs AFG T20I: కొత్త ఏడాది తొలి టీ20 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించి సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. శివమ్ దూబే (60 నాటౌట్, 1/9) ఆల్ రౌండ్ ప్రదర్శనతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించింది. భారత బౌలర్లు మొదట ఆఫ్ఘనిస్తాన్‌ను కేవలం 158 పరుగులకే పరిమితం చేశారు. భారత్ 18వ ఓవర్లో లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 14 నెలల తర్వాత టీ20 ఇంటర్నేషనల్‌లోకి పునరాగమనం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ ఘనమైన విజయం అందుకున్నాడు. ఇప్పుడు రెండో మ్యాచ్‌కి ఇరు జట్లు సన్నద్ధం అవుతున్నాయి.

భారత్, అఫ్గానిస్థాన్ మధ్య రెండో టీ20 మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

జనవరి 14 ఆదివారం భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.

భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో టీ20 మ్యాచ్ ఎక్కడ జరగనుంది?

ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో భారత్, అఫ్గానిస్థాన్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.

భారత్, అఫ్గానిస్థాన్ మధ్య రెండో టీ20 మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో టీ20 మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. సాయంత్రం 6:30 గంటలకు టాస్‌ జరగనుంది.

భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌ని ఏ ఛానెల్‌లో వీక్షించవచ్చు?

స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌ని వీక్షించవచ్చు.

భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండవ T20 మ్యాచ్ ఎక్కడ ప్రత్యక్ష ప్రసారం కానుంది?

భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే రెండవ T20 మ్యాచ్ JioCinema యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

టీ20 సిరీస్ కోసం ఇరు జట్ల జట్టు..

టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యస్సవి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

అఫ్గానిస్థాన్ జట్టు: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇక్రమ్ అలీఖిల్, హజ్రతుల్లా జజాయ్, రహమత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్ముల్లా ఉమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మల్, ఫజుల్ అహ్మల్, నవ్ హక్మాల్, మహ్మద్ సలీమ్, కైస్ అహ్మద్, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..