T20 World Cup: మీకోసమే ఎదురుచూస్తున్నాం.. మెల్‌బోర్న్‌లో తేల్చుకుందాం.. టీమిండియాకు అక్తర్ సవాల్
డిక్కీలు మొక్కీలు తిని అదృష్టం కొద్దీ సెమీస్‌కు చేరిన పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది కివీస్. మరోవైపు గురువారం (నవంబర్ 10) జరిగే రెండో సెమీఫైనల్లో ఇండియా, ఇంగ్లండ్ జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ బిగ్‌ఫైట్ ప్రారంభంకానుంది.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ తుది అంకానికి చేరుకుంది. బుధవారం (నవంబర్ 9) జరిగిన తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్.. న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్ పోరుకు దూసుకెళ్లిందిది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఎంతో పటిష్ఠంగా కనిపించిన న్యూజిలాండ్.. కీలక నాకౌట్ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. బ్యాటర్లు, బౌలర్లు అందరూ తీవ్ర ఒత్తిడికి గురై, స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో డిక్కీలు మొక్కీలు తిని అదృష్టం కొద్దీ సెమీస్‌కు చేరిన పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది కివీస్. మరోవైపు గురువారం (నవంబర్ 10) జరిగే రెండో సెమీఫైనల్లో ఇండియా, ఇంగ్లండ్ జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ బిగ్‌ఫైట్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఆదివారం (నవంబర్ 13)న మెల్‌బోర్న్ వేదికగా జరిగే ఫైనల్ పోరులో పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఇదిలా ఉంటే ఒకానొక దశలో టీ20 ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించాల్సిన పాక్ ఏకంగా ఫైనల్‌కు చేరుకోవడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దైంది.
అప్పుడే అంత బిల్డప్పా?
ఈ నేపథ్యంలో టీమిండియాను ఉద్దేశిస్తూ పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ మ్యాచ్ కోసం భారత జట్టుకు విషెస్ చెబుతూనే.. మరో రసవత్తర సమరం కోసం మెల్‌బోర్న్‌లో ఎదురుచూస్తుంటామంటూ సెటైరికల్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. టీమిండియా అభిమానులు అక్తర్ ట్వీట్‌పై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘అప్పుడే.. అంత బిల్డప్ అవసరమా? కొంచెం ఓపిక పట్టండి.. మేం కూడా వస్తున్నామంటూ కౌంటర్లిస్తున్నారు. ముందుగా ఇంగ్లండ్ పని చూసి, తీరిగ్గా మీ కథ తేల్చుతాం అంటూ ఘాటుగా బదులిస్తున్నారు.
Dear India, good luck for tomorrow. We’ll be waiting for you in Melbourne for a great game of cricket. pic.twitter.com/SdBLVYD6vm
— Shoaib Akhtar (@shoaib100mph) November 9, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..