టీమిండియాలో ‘ఫిట్‌నెస్ స్కామ్’.. ఆ అన్‌ఫిట్ ప్లేయర్లతో మ్యాచ్‌లు గెలవలేం.. ఎన్‌సీఏ పనితీరుపై రోహిత్ కీలక ఆరోపణలు..

IND vs BAN: బంగ్లాదేశ్‌లో సిరీస్ ఓటమి తర్వాత, రోహిత్ శర్మ సంచలన ఆరోపణలు చేశాడు. జాతీయ క్రికెట్ అకాడమీపై ప్రశ్నలు లేవనెత్తాడు.

టీమిండియాలో 'ఫిట్‌నెస్ స్కామ్'.. ఆ అన్‌ఫిట్ ప్లేయర్లతో మ్యాచ్‌లు గెలవలేం.. ఎన్‌సీఏ పనితీరుపై రోహిత్ కీలక ఆరోపణలు..
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Dec 08, 2022 | 12:35 PM

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ జాతీయ క్రికెట్ అకాడమీపై ప్రశ్నలు సంధించాడు. హాఫ్‌ ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లతో జట్టు విజయాలు సాధించడం కుదరదంటూ సంచలన ఆరోపణలు చేశాడు. అసలు ప్రశ్న ఏమిటంటే, రోహిత్ శర్మ ఏ ఆటగాడు ఫిట్‌గా లేడో చెప్పలేదు? జట్టు మొత్తం జాతీయ క్రికెట్ అకాడమీలో కూర్చోవాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో ఆటగాళ్లకు ఇన్ని గాయాలకు కారణాలేమిటో తెలుసుకోవాలని రోహిత్ శర్మ స్పష్టంగా చెప్పుకొచ్చాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డే తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ, ‘మేం NCAలో కూర్చుని ఆటగాళ్ల పనిభారాన్ని గమనించాలి. సగం ఫిట్‌నెస్‌తో ఉన్న ఆటగాళ్లతో దేశానికి ప్రాతినిధ్యం వహించలేము. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వంగా ఉంటుంది. అయితే, ఆ ఆటగాడు పూర్తిగా ఫిట్‌గా లేకుంటే అది ఆదర్శవంతమైన మ్యాచ్ కాలేదు. మనం మరింత లోతుకు వెళ్లి దాని వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసుకోవాలి” అని చెప్పుకొచ్చాడు.

‘దేశానికి 100 శాతానికి పైగా ఫిట్‌నెస్ అవసరం’

ఒక ఆటగాడు భారత్‌కు ఆడేందుకు వచ్చినప్పుడల్లా 100 శాతానికి పైగా ఫిట్‌గా ఉండాలని అర్థం చేసుకోవాలని రోహిత్ శర్మ అన్నాడు. ప్రస్తుత వన్డే సిరీస్‌లోనే రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పుకున్నాడు. అదే సమయంలో దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ కూడా గాయం కారణంగా దూరమయ్యారు. దీపక్ చాహర్ నిరంతరం గాయాల బారిన పడుతున్నాడు. ఐపీఎల్‌కు ముందు కూడా అతను గాయపడ్డాడు. చాలా కాలం తర్వాత తిరిగి వచ్చిన అతను మరోసారి గాయపడ్డాడు.

ఇవి కూడా చదవండి

టీమిండియాలో సగం మందికి గాయాలు..

గాయపడిన టీమిండియా ఆటగాళ్ల జాబితా చిన్నదేమీ కాదు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లు ఇప్పటికే గాయపడి, ఎన్నో సిరస్‌లకు దూరమయ్యారు. బుమ్రా సుదీర్ఘ విశ్రాంతి తర్వాత టీమ్ ఇండియాకు తిరిగి వచ్చాడు, కానీ 2-4 మ్యాచ్‌లు ఆడిన తర్వాత, అతను మరోసారి అన్‌ఫిట్ అయ్యాడు. టీ20 ప్రపంచ కప్ కూడా ఆడలేకపోయాడు. ఆసియా కప్‌లో గాయపడిన రవీంద్ర జడేజా కూడా ఫిట్‌గా లేడు. పేలవమైన ఫిట్‌నెస్ కారణంగా, భారతదేశం తన పూర్తి స్థాయి జట్టును బరిలోకి దించలేకపోయింది. బహుశా భారత జట్టు పనితీరు క్షీణించడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చని భావిస్తున్నారు.

NCA పనితీరుపై విమర్శలు..

బెంగళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీ పని ప్రస్తుత క్రికెటర్ల ఫిట్‌నెస్, భవిష్యత్ ఆటగాళ్లతో పాటు వారి ఆట స్థాయిని పెంచడం. ఎవరైనా ఆటగాడు గాయపడినట్లయితే, అతను NCAకి మాత్రమే వెళ్లాలి. గత కొన్ని నెలలుగా బుమ్రా, చాహర్, షమీ లాంటి ఆటగాళ్లు ఎన్‌సీఏలో ఎక్కువ సమయం గడిపారు. ఈ ఆటగాళ్లు NCA నుంచి గ్రీన్ సిగ్నల్ తర్వాత మాత్రమే టీమిండియాలో చేరారు. కానీ, కొన్ని మ్యాచ్‌ల తర్వాత, వారు మళ్లీ గాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్‌సీఏ సరిగా పనిచేయడం లేదా? దీనిపై బీసీసీఐ విచారణ అవసరమా? అనే విమర్శలు ప్రస్తుతం ఎక్కువ అయ్యాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..