Raksha Bandhan 2025: వాషింగ్టన్ సుందర్ నుంచి స్మృతి మంధాన వరకు.. క్రికెట్లో మెరిసిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు వీళ్లే
ఈరోజు దేశవ్యాప్తంగా అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి తనను రక్షించమని కోరుతుంది. సోదరుడు తన సోదరిని జీవితాంతం రక్షిస్తానని ప్రమాణం చేస్తాడు. క్రికెట్‌లో కూడా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల జంటలు ఉన్నాయి.

Raksha Bandhan 2025: ఈరోజు దేశవ్యాప్తంగా రాఖీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగలో అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి, వారి ప్రేమను, ఆప్యాయతను చాటుకుంటారు. సోదరులు తమ సోదరిని జీవితాంతం రక్షించుకుంటానని మాట ఇస్తారు. ఇలా అన్నదమ్ముల బంధాన్ని, ప్రేమను మరింత పెంచే ఈ పండుగ రోజున, మనం క్రికెట్ ప్రపంచంలో మెరిసిన అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ల జంటల గురించి తెలుసుకుందాం. వీరు మైదానంలోనూ, బయట కూడా తమ స్పెషాలిటీని చాటుకున్నారు.
1. వాషింగ్టన్ సుందర్, శైలజ సుందర్
ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్‌లో భారత క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. భారత్ ఈ సిరీస్‌ను 2-2తో సమం చేయడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అయితే, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే వాషింగ్టన్ సుందర్ సోదరి శైలజ సుందర్ కూడా ఒక క్రికెటరే. శైలజ తమిళనాడు తరపున దేశీయ క్రికెట్ ఆడింది.
2. స్మృతి మంధాన, శ్రవణ్ మంధాన
భారత మహిళా క్రికెట్‌లో అత్యంత గొప్ప పేరు స్మృతి మంధాన. లెఫ్ట్ హ్యాండ్‌తో స్టైలిష్ బ్యాటింగ్‌కు ఆమె పేరుగాంచింది. ఆమె పేరు మీద అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక గొప్ప రికార్డులు ఉన్నాయి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, స్మృతి మంధాన సోదరుడు శ్రవణ్ మంధాన కూడా క్రికెటరే. అతను చాలా క్రికెట్ ఆడినప్పటికీ ప్రస్తుతం శ్రవణ్ క్రికెట్‌కు దూరంగా ఉన్నారు.
3. పవన్ నేగి, బబితా నేగి
భారతదేశం తరపున ఒక టీ20 మ్యాచ్ ఆడిన పవన్ నేగి, ఐపీఎల్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు. నేగి చాలా కాలం చెన్నై సూపర్ కింగ్స్, ఆ తర్వాత ఆర్‌సీబీ జట్టుకు కూడా ఆడారు. అతను టీమిండియా తరపున ఆడిన ఒక మ్యాచ్‌లో 16 పరుగులు చేసి, ఒక వికెట్ కూడా తీశాడు. అయితే, ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో తిరిగి కనిపించలేదు. ఇప్పుడు లెజెండ్స్ లీగ్‌లలో ఆడుతున్నాడు. పవన్ నేగి సోదరి బబితా నేగి కూడా ఢిల్లీ తరపున దేశీయ క్రికెట్ ఆడుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….




