Virat Kohli vs MS Dhoni: విరాట్ కోహ్లీ vs ఎంఎస్ ధోని.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులున్నాయో తెలుసా ?
భారత క్రికెట్‌లో ఇద్దరు దిగ్గజాలు, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ కేవలం వారి ఆటతోనే కాకుండా, వారి అపారమైన సంపాదనతో కూడా నిత్యం వార్తల్లో ఉంటారు. క్రికెట్ కెరీర్‌తో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్లు, వ్యాపారాలు, పెట్టుబడుల ద్వారా వీరిద్దరూ కోట్లాది రూపాయలు సంపాదించారు.

Virat Kohli vs MS Dhoni:భారత క్రికెట్ చరిత్రలో అత్యంత లెజెండ్ క్రికెటర్లు అయిన విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ మైదానంలోనే కాకుండా సంపాదనలో కూడా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. వీరిద్దరూ కేవలం ఆటతోనే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్లు, వ్యాపారాలు, పెట్టుబడుల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారు. 2025లో ప్రోబో నివేదిక ప్రకారం, ఈ ఇద్దరు దిగ్గజాల మొత్తం సంపద ఎంత, సంపాదనలో ఎవరు ముందున్నారు? వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెటర్లలో ఒకరైన విరాట్ కోహ్లీ మొత్తం ఆస్తుల విలువ సుమారు $127 మిలియన్లు (సుమారు రూ.1,050 కోట్లు). క్రికెట్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపారాల ద్వారా కోహ్లీ భారీగా సంపాదిస్తున్నాడు. బీసీసీఐ కాంట్రాక్ట్,ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అతని ఒప్పందం ద్వారా భారీ జీతం పొందుతున్నాడు. ప్యూమా, ఎంఆర్ఎఫ్, ఆడి, బూస్ట్ వంటి పెద్ద బ్రాండ్లతో కోట్ల రూపాయల ఒప్పందాలు ఉన్నాయి. Wrogn (దుస్తుల బ్రాండ్), Chisel Fitness (జిమ్ చైన్), వన్8, డిజిట్ ఇన్సురెన్స్, బ్లూ ట్రైబ్, Rage Coffee వంటి స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టాడు. టెస్ట్, టీ20 క్రికెట్ నుండి రిటైర్ అయినప్పటికీ కోహ్లీ పాపులారిటీ, సంపాదన ఏమాత్రం తగ్గలేదు.
ఎంఎస్ ధోనీ విషయానికి వస్తే.. ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు $123 మిలియన్లు (సుమారు రూ.1,000 కోట్లు). ధోనీ క్రికెట్‌తో పాటు వ్యాపార ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత కూడా, ధోనీ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా భారీ జీతం పొందుతున్నాడు. రీబాక్, డ్రీమ్11, ఇండిగో పెయింట్స్ వంటి పెద్ద బ్రాండ్లతో బ్రాండ్ డీల్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు. సెవెన్ అనే లైఫ్‌స్టైల్ బ్రాండ్, Chennaiyin FC (ఫుట్‌బాల్ జట్టు), SportsFit ఫిట్‌నెస్ చైన్‌లో వాటాలు, ఇతర పెట్టుబడుల ద్వారా ధోనీ సంపాదన అధికంగా ఉంది.
ప్రోబో నివేదిక ప్రకారం, విరాట్ కోహ్లీ మొత్తం ఆస్తుల విలువ ఎంఎస్ ధోనీ కంటే కొంచెం ఎక్కువ. కోహ్లీ నిలకడగా ఆటలో అద్భుతమైన ప్రదర్శన, పెద్ద బ్రాండ్లతో ఒప్పందాలు, తెలివైన ఇన్వెస్ట్ మెంట్లు అతని సంపాదనను మరింత పెంచాయి. ధోనీ కూడా రిటైర్ అయిన తర్వాత కూడా ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉన్నప్పటికీ, సంపాదనలో కోహ్లీ ప్రస్తుతం ముందంజలో ఉన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….




