34 పరుగులకే సగం మంది ఔట్.. కానీ ఏడో స్థానంలో బ్యాటింగ్ వచ్చి జట్టును గెలిపించాడు..
Cricket News: IPL 2021 పున ప్రారంభం కోసం మొత్తం క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తుంది. సెప్టెంబర్ 19 ఆదివారం నుంచి మొదలవుతుంది.
Cricket News: IPL 2021 పున ప్రారంభం కోసం మొత్తం క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తుంది. సెప్టెంబర్ 19 ఆదివారం నుంచి మొదలవుతుంది. సహజంగానే ఈ లీగ్ అభిమానులందరిని అలరిస్తుంది. కానీ వీటన్నింటి మధ్య ఇంగ్లాండ్‌లో టీ 20 టోర్నమెంట్ జరుగుతోంది. శనివారం మొదటి సెమీ-ఫైనల్ సోమర్‌సెట్ వర్సెస్ హాంప్‌షైర్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో హాంప్‌షైర్‌ను కేవలం 2 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ బెర్త ఖరారు చేసుకుంది సోమర్‌సెట్ జట్టు. అయితే ఈ విజయంలో జట్టు లోయర్ ఆర్డర్ అద్భుతంగా రాణించడం విశేషం.
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన టీ 20 బ్లాస్ట్ మొదటి సెమీ ఫైనల్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. హాంప్‌షైర్ మొదట బ్యాటింగ్ చేసింది. 26 పరుగులకే జట్టు 3 వికెట్లు కోల్పోయింది. అలాంటి పరిస్థితిలో జో వెదర్లీ జట్టును నిర్వహించే బాధ్యతను తీసుకున్నాడు. వేగంగా పరుగులు సేకరించడం కొనసాగించాడు. వికెట్ల పతనం అవతలి వైపు నుంచి కొనసాగుతుంది. చివరి ఓవర్ ఐదవ బంతికి వెదర్లీ అవుట్ అయ్యాడు కానీ అతను కేవలం 50 బంతుల్లో 71 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును 150 పరుగులకు చేర్చాడు. సోమర్‌సెట్ పేసర్ జోష్ డేవి హాంప్‌షైర్ భారీ స్కోర్ చేయకుండా ఆపడంలో కీలకపాత్ర పోషించాడు. అతను 34 పరుగులకు 4 వికెట్లు తీసుకున్నాడు. అందులో ఇద్దరు టాప్ ఆర్డర్, ఇద్దరు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌లు ఉన్నారు.
34 పరుగులకే సోమర్‌సెట్ 5 వికెట్లు 20 ఓవర్లలో151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్‌సెట్ కేవలం 34 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. హాంప్‌షైర్ కోసం జో వెదర్లీ ఇన్నింగ్స్‌ను నిర్వహించినట్లే సోమర్‌సెట్ కోసం నాలుగో బ్యాట్స్‌మన్ టామ్ అబెల్ కూడా ఇన్నింగ్స్ నిర్మంచాడు. టామ్ కేవలం 35 బంతుల్లో 50 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును 100 పరుగులకు మించి తీసుకెళ్లి విజయంపై ఆశలు కలిగించాడు. చివరి 3 ఓవర్లలో సోమర్‌సెట్ విజయానికి 46 పరుగులు అవసరం. ఇక్కడ ఏడో నంబర్ బ్యాట్స్‌మన్ బెన్ గ్రీన్ ఒక తుఫాను ఇన్నింగ్స్ ఆడి భయాందోళనలు సృష్టించాడు. 17, 18 వ ఓవర్లలో 3 సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టడం ద్వారా జట్టును విజయానికి చేరువ చేశాడు. కేవలం18 బంతుల్లో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివరి ఓవర్‌లో సోమర్‌సెట్‌కు కేవలం 2 వికెట్లు మాత్రమే ఉన్నాయి. కానీ10 పరుగులు అవసరం. బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన జోష్ డేవి కేవలం 3 బంతుల్లో సిక్స్‌లు, ఫోర్లతో 11 పరుగులు చేసి జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు.