Virat Kohli-Sourav Ganguly: సౌరవ్ గంగూలీ-విరాట్ కోహ్లీ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసిన భారత మాజీ కెప్టెన్..!

'సెలక్షన్ కమిటీ తరపున సౌరవ్ గంగూలీ మాట్లాడే ప్రసక్తే లేదని.. అతడు బీసీసీఐ అధ్యక్షుడని.. సెలెక్షన్ లేదా కెప్టెన్సీ విషయంలో సెలక్షన్ కమిటీ అధినేత మాట్లాడి ఉండాల్సింది' అని మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డాడు.

Virat Kohli-Sourav Ganguly: సౌరవ్ గంగూలీ-విరాట్ కోహ్లీ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసిన  భారత మాజీ కెప్టెన్..!
Bcci Virat Kohli Vs Ganguly
Follow us

|

Updated on: Dec 23, 2021 | 11:33 AM

Virat Kohli vs BCCI: జాతీయ సెలెక్టర్ల తరపున విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అంశంపై బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడి ఉండాల్సిందని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ సెలక్షన్ కమిటీ చీఫ్ దిలీప్ వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డారు. వాస్తవానికి, దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు, భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, టి 20 కెప్టెన్సీ నుంచి వైదొలగే తన నిర్ణయాన్ని పునరాలోచించమని బీసీసీఐ నుంచి ఎవరూ కోరలేదంటూ తిరుగుబాటు వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో, ఈ విషయంపై తాను కోహ్లీతో మాట్లాడానని గంగూలీ పేర్కొన్నాడు.

మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ.. ‘సెలక్షన్ కమిటీ తరపున సౌరవ్ గంగూలీ మాట్లాడే ప్రసక్తే లేదని.. అతడు బీసీసీఐ ప్రెసిడెంట్.. సెలక్షన్ లేదా కెప్టెన్సీ విషయంలో సెలక్షన్ కమిటీ హెడ్ చేతన్ శర్మ మాట్లాడి ఉండాల్సింది” అని అన్నాడు.

టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి వైదొలగాలని నిర్ణయించుకున్న తర్వాత, పరిమిత, సుధీర్ఘ ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండటం వల్ల ప్రయోజనం లేదని, రోహిత్ శర్మను వన్డే జట్టుకు కెప్టెన్‌గా చేయాలని నిర్ణయించినట్లు గంగూలీ చెప్పడం గమనార్హం. దీనికి సంబంధించి వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ.. కెప్టెన్‌ని ఎంపిక చేయడం లేదా తొలగించడం సెలక్షన్ కమిటీ నిర్ణయమని, అది గంగూలీ పరిధిలోకి రాదని అన్నాడు.

సౌరవ్ గంగూలీ వాదనను ఖండించిన కోహ్లీ.. సౌరవ్ గంగూలీ ప్రకటనకు విరుద్ధంగా ప్రకటించాడు. నా నిర్ణయంతో ఎవరికీ ఇబ్బంది లేదు అని విరాట్ కోహ్లీ అన్నాడు. టీ20 కెప్టెన్సీని వదులుకోవద్దని ఎవరూ చెప్పలేదు. టీ20 కెప్టెన్సీని వదులుకోవడం గురించి బీసీసీఐకి మొట్టమొదట చెప్పాను. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు టీ20 కెప్టెన్సీని వదులుకోవద్దని నాకు చెప్పలేదు. కానీ, నా ఆ నిర్ణయం ప్రశంసలందుకుంది” అని కోహ్లీ పేర్కొన్నాడు.

సౌరవ్ గంగూలీ ఏమన్నాడంటే.. వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లిని తొలగించిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో దాదా మాట్లాడుతూ, “టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగవద్దని మేం విరాట్ కోహ్లీని అభ్యర్థించాం. కానీ, అతను ఈ స్థానంలో కొనసాగడానికి ఇష్టపడడం లేదు. టీ20 కెప్టెన్సీని వదులుకోవద్దని తాను స్వయంగా కోహ్లీకి విజ్ఞప్తి చేశాం. అయితే పనిభారం గురించి మాట్లాడుతూ విరాట్ టీ20 కెప్టెన్సీని వదులుకోవడంపై మొండి వైఖరితో ఉన్నాడని తెలిపాడు.

Also Read: 1983 World Cup: ‘కపిల్, మనం డూ ఆర్ డై పరిస్థితిలో ఉన్నాం, ఇలా చూస్తూ చావలేం’

Watch Video: 150 కిమీ వేగంతో బుల్లెట్‌లా దూసుకొచ్చిన బంతి.. బ్యాట్స్‌మెన్ ఫ్యూజులు ఔట్.. వైరల్ వీడియో!

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..