Watch Video: 150 కిమీ వేగంతో బుల్లెట్‌లా దూసుకొచ్చిన బంతి.. బ్యాట్స్‌మెన్ ఫ్యూజులు ఔట్.. వైరల్ వీడియో!

క్రికెట్‌లో స్వింగ్ బౌలింగ్ అత్యంత ప్రమాదకరమని చెప్పడంలో సందేహం లేదు. పేస్ కంటే కూడా బ్యాట్స్‌మెన్లు స్వింగ్‌ను...

Watch Video: 150 కిమీ వేగంతో బుల్లెట్‌లా దూసుకొచ్చిన బంతి.. బ్యాట్స్‌మెన్ ఫ్యూజులు ఔట్.. వైరల్ వీడియో!
Jason Beherndroff
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 23, 2021 | 10:09 AM

క్రికెట్‌లో స్వింగ్ బౌలింగ్ అత్యంత ప్రమాదకరమని చెప్పడంలో సందేహం లేదు. పేస్ కంటే కూడా బ్యాట్స్‌మెన్లు స్వింగ్‌ను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బందులు పడతారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఔట్ స్వింగర్లను ఎదుర్కోలేరు. కొన్నిసార్లు అలాంటి బంతులకు ఔటైన సందర్భాలూ లేకపోలేదు. సరే.! స్వింగ్ బౌలింగ్ గ్రేట్ అని మీరు అనవచ్చు.. అసలు ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ బిగ్‌బాష్ లీగ్ 2021-22లో విధ్వంసం సృష్టించాడు. పదునైన స్వింగ్ బంతులతో బ్యాట్స్‌మెన్ల గుండెల్లో దడ పుట్టించాడు. ఈ టోర్నీలో జరిగిన 17వ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ 21 పరుగుల తేడాతో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌పై విజయం సాధించింది. ఇందులో పెర్త్ స్కార్చర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఫాస్ట్ బౌలర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ ఇన్నింగ్స్ తొలి బంతికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ అద్భుతమైన అవుట్ స్వింగ్..

207 పరుగుల భారీ టార్గెట్‌ను చేధించే క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన పెర్త్ స్కోచర్స్ ఫాస్ట్ బౌలర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ రెండో బంతికి అద్భుతమైన అవుట్ స్వింగ్‌ను ప్రదర్శించాడు. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ ఓపెనర్ మెకెంజీ హార్వేని అవుట్ చేయడంలో భాగంగా మిడిల్ స్టంప్‌పై జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ అవుట్ స్వింగ్‌తో కూడిన ఫుల్ లెంగ్త్ డెలివరీని సంధించాడు. దీనితో దెబ్బకు బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశాడు. హర్వే ఆ బంతిని లెగ్ సైడ్‌లో ఫ్లిక్ ఆడటానికి ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు. ఇక బెహ్రెన్‌డ్రాఫ్ వేసిన ఈ బంతిని చూసిన మాజీ క్రికెటర్లు ‘వావ్ వాట్ ఏ బౌలింగ్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ అద్భుతమైన స్వింగ్ బౌలింగ్‌ను ప్రదర్శించడం ఇదేం మొదటిసారి కాదు. 2019లో ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లో అద్భుతమైన స్వింగ్‌ బౌలింగ్‌తో 5 వికెట్లు పడగొట్టి ఆసీస్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బెహ్రెన్‌డార్ఫ్ 2020 సీజన్‌లో 5 మ్యాచ్‌లు ఆడి బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఆ తర్వాత అతడిని ముంబై జట్టు రిలీజ్ చేసింది. ఇప్పుడు ఐపీఎల్ 2022 మెగా వేలం జరగనుండగా.. బెహ్రెన్‌డార్ఫ్ భారీ ధర పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Also Read: కళ్లతో కట్టిపడేస్తున్న ఈ చిన్నది ఇప్పుడు తన అందంతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది.. ఎవరో గుర్తుపట్టారా!