IPL 2023: ఓటమిలోనూ కింగ్ ‘కోహ్లీ’నే.. చెత్త రికార్డుల్లో అగ్రస్థానం.. టాప్ 5 లిస్టులో ఎవరున్నారంటే?
Virat Kohli: ప్రస్తుత కాలంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన విరాట్ కోహ్లి.. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. అయితే ఇప్పటి వరకు తన జట్టుకు టైటిల్ అందించలేదు.
ప్రస్తుత కాలంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన విరాట్ కోహ్లి.. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. అయితే ఇప్పటి వరకు తన జట్టుకు టైటిల్ అందించలేదు. అయితే, ఈ లీగ్‌లో కోహ్లీ పేరు ఎవరూ సాధించడానికి ఇష్టపడని రికార్డులో మాత్రం నమోదైంది. కోహ్లి మాత్రమే కాదు, అతని సహచరుడు దినేష్ కార్తీక్ కూడా ఈ లిస్టులో చేరాడు. కార్తీక్ 2018 నుంచి 2021 వరకు కోల్‌కతా కెప్టెన్‌గా ఉన్నాడు.
కోల్‌కతా 2022 సీజన్‌కు ముందు కార్తీక్‌ను విడుదల చేసింది. బెంగళూరు జట్టులో అతను చేరాడు. కోల్‌కతా టీం బెంగళూరును ఓడించినప్పుడు, కార్తీక్ బెంగళూరు ప్లేయింగ్-11లో భాగంగా ఉన్నాడు. బెంగళూరు జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు కోహ్లీ, కార్తీక్‌లు ఐపీఎల్‌లో అత్యధికంగా ఓడిపోయిన ఆటగాళ్లుగా నిలిచారు.
ఓటమిలోనూ కింగ్ కోహ్లీ..
ఐపీఎల్‌లో అత్యధిక పరాజయాలు అందుకున్న ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. కోహ్లి 111 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశాడు. ఈ విషయంలో తనకంటే ఎవరూ ముందు లేరు. అతని సొంత జట్టుకు చెందిన కార్తీక్ ఈ లిస్టులో కోహ్లీ తర్వాత నిలిచాడు. కోహ్లీ మొదటి నుంచి బెంగళూరులోనే ఉన్నా కార్తీక్ ఢిల్లీ, ముంబై, గుజరాత్, కోల్‌కతా ఫ్రాంచైజీల్లో ఆడాడు. కార్తీక్ 109 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశాడు.
మూడో స్థానంలో కోల్‌కతా, చెన్నై ఫ్రాంచైజీల తరపున ఆడిన రాబిన్ ఉతప్ప ఉన్నాడు. 106 మ్యాచ్‌ల్లో ఓటమిని చవి చూశాడు. ఆ తర్వాత 103 మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 99 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. టై అయిన మ్యాచ్‌ల గణాంకాలు వీటిలో లేవు.
గెలుపులోనూ అగ్రస్థానమే..
అత్యధిక ఓటములు చవిచూసిన ఆటగాళ్ల జాబితాలో కార్తీక్ పేరు రెండో స్థానంలో ఉంది. కానీ, గణాంకాల పరంగా చూస్తే అతను ఓడిపోయిన దానికంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచాడు . ఐపీఎల్‌లో కార్తీక్ 117 మ్యాచ్‌లు గెలిచాడు. ఐపీఎల్‌లో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో ధోనీ 136 విజయాలు సాధించాడు. మరోవైపు చెన్నై మాజీ ఆటగాడు సురేశ్ రైనా 122 విజయాలు సాధించాడు. 121 విజయాలతో రోహిత్ సంఖ్య మూడో స్థానంలో ఉంది. చెన్నైకి చెందిన జడేజా 119 మ్యాచ్‌లు గెలిచాడు. అతని తర్వాత కార్తీక్ ఉన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..