AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: లైవ్‌లోనే క్రికెటర్ పరువు తీసిన భార్య.. నా ఫేవరేట్ అదేనంటూ.. నెట్టింట్లో వైరల్ వీడియో..

సౌతాఫ్రికా ప్లేయర్ ఏబీ డివిలియర్స్ (AB de Villiers) అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా భారతీయులైతే ఐపీఎల్‌లో అతడి ఆటతీరుకు ఫిదా అయ్యారు. మిస్టర్ 360 డిగ్రీగా పేరుగాంచిన ఏబీడీ.. ఐపీఎల్‌లో ఆర్సీబీతో (RCB) ఆడాడు.

Watch Video: లైవ్‌లోనే క్రికెటర్ పరువు తీసిన భార్య.. నా ఫేవరేట్ అదేనంటూ.. నెట్టింట్లో వైరల్ వీడియో..
Mr Mrs De Villiers
Venkata Chari
|

Updated on: Apr 07, 2023 | 4:12 PM

Share

సౌతాఫ్రికా ప్లేయర్ ఏబీ డివిలియర్స్ (AB de Villiers) అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా భారతీయులైతే ఐపీఎల్‌లో అతడి ఆటతీరుకు ఫిదా అయ్యారు. మిస్టర్ 360 డిగ్రీగా పేరుగాంచిన ఏబీడీ.. ఐపీఎల్‌లో ఆర్సీబీతో (RCB) ఆడాడు. అలాగే కోహ్లీ, ఏబీడీ అనుబంధం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, డివిలియర్స్ 2021లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. కాగా, కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా జియో సినిమాలో సందడి చేశారు. కోల్‌కతాలో గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ (RCBvsKKR) తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు జియో సినిమా నిర్వహించిన ఓ కార్యక్రమంలో భార్య డేనియల్ డివిలియర్స్‌తో పాటు డివిలియర్స్ (Danielle de Villiers) పాల్గొన్నారు.

RCB ఇప్పటి వరకు ట్రోఫీని గెలవనప్పటికీ ఏబీ డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్‌గానే చూస్తుంటారు అభిమానులు. ఏబీ ఐపీఎల్‌లో ఆడడం లేదనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డివిలియర్స్ గౌరవార్థం, RCB ఆయన జెర్సీని శాశ్వతంగా అలానే ఉంచింది. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ RCB హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించాడు. KKR vs RCB మ్యాచ్‌కు ముందు ఏబీ డివిలియర్స్, అతని భార్య డేనియల్ డివిలియర్స్ జియో సినిమా నిర్వహించిన క్విక్ ఫైర్ రౌండ్‌లో పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమంలో భార్య ఇచ్చిన షాక్‌కు డివిలియర్స్ అవాక్కయ్యాడు.

ఇవి కూడా చదవండి

క్విక్ ఫైర్ రౌండ్‌లో యాంకర్ వరుసగా అడిగిన ప్రశ్నలకు భార్యభర్తలు సమాధానాలు చెప్పారు. ఇందులో భాగంగా తొలి ప్రశ్నగా ఇష్టమైన కళాకారుడి గురించి అడిగారు. ఇద్దరూ తడుముకోకుండా “కోల్డ్‌ప్లే” అంటూ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఇష్టమైన వంటకం గురించి అడిగితే.. జపాన్ వంటకం సుశీ అంటూ గుక్క తిప్పకుండా ఆన్సర్ చేశారు.

ఈ క్రమంలో మీరు IPL 2023లో ఏ జట్టుకు మద్దతు ఇస్తున్నారు? అంటూ యాంకర్ ప్రశ్నించగా.. ఏబీ మాత్రం ‘RCB’ అంటూ చెప్పగా.. ఆయన భార్య మాత్రం KKR అంటూ బదులిచ్చింది. ఎందుకంటే అది షారుఖ్ ఖాన్ టీమ్. ఆయనంటే నాకు చాలా ఇష్టం” అంటూ చెప్పుకొచ్చింది. తన భార్య మాటలు విన్న డివిలియర్స్ షాక్ అయ్యాడు. ఆశ్చర్యపోతూ, “నువ్వు తమాషా చేస్తున్నావా?” అంటూ భార్యను అడిగాడు. దీంతో ఆయ న భార్య కన్ను కొడుతూ.. అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..