AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photos: కేకేఆర్ జట్టులో నీరజ్ చోప్రా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంట్రీ.. షాకవుతోన్న నెటిజన్స్..

Indian Premier League 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో కోల్‌కతా జట్టు తరపున ఆడిన లెగ్ స్పిన్ బౌలర్ సుయాష్ శర్మ.. తన బౌలింగ్‌తో పాటు తన లుక్స్‌తోనూ అభిమానులను ఆశ్చర్యపరిచాడు.

Viral Photos: కేకేఆర్ జట్టులో నీరజ్ చోప్రా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంట్రీ.. షాకవుతోన్న నెటిజన్స్..
Suyash Sharma Neeraj Chopra
Venkata Chari
|

Updated on: Apr 07, 2023 | 5:00 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16వ సీజన్‌లో 9వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై ఘన విజయం సాధించింది. కోల్‌కతా హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 81 పరుగుల తేడాతో ఏకపక్షంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టీం 19 ఏళ్ల లెగ్ స్పిన్ బౌలర్ సుయాష్ శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతని బౌలింగ్ యాక్షన్‌తోపాటు అతని లుక్ కారణంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాలా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.

IPLలో అరంగేట్రం చేసిన సుయాష్ శర్మ.. తన మొదటి మ్యాచ్‌లో 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, కర్ణ్ శర్మల వికెట్లు ఉన్నాయి. తన నుదిటిపై బ్యాండ్ ధరించి కనిపించడంతో పాటు, సుయాష్ శర్మ తన జట్టు యజమాని, బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ శైలిలో కూడా కనిపించాడు.

ఇవి కూడా చదవండి

దీంతో సోషల్ మీడియాలో అభిమానులు అతన్ని కోల్‌కతా జట్టుకు చెందిన నీరజ్ చోప్రా అంటూ పిలిచారు. ఒలింపిక్ బంగారు పతక విజేత భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కూడా తన నుదిటిపై తల బ్యాండ్ కట్టి జావెలిన్ విసిరుతుండడం మనం చూసే ఉన్నాం.

ఇంపాక్ట్ ప్లేయర్‌గా చేరిన సుయాష్ శర్మ..

RCBతో జరిగిన ఈ మ్యాచ్‌లో సుయాష్ శర్మను KKR జట్టు ఇంపాక్ట్ ప్లేయర్‌గా చేర్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు. అరంగేట్రం మ్యాచ్‌లోనే 30 పరుగులకే 3 వికెట్లు పడగొట్టిన సుయాష్.. అరంగేట్రం మ్యాచ్‌లోనే అత్యుత్తమంగా బౌలింగ్ చేయడంలో ఐపీఎల్ చరిత్రలో రెండో స్థానంలో నిలిచాడు. IPLలో అరంగేట్రం చేయడానికి ముందు, సుయాష్ ఏ ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లేదా లిస్ట్-Aలో ఏ మ్యాచ్ కూడా ఆడలేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..