AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: మటన్ రోల్‌ కోసం ప్రాణాల్ని ఫణంగా పెట్టిన విరాట్‌ కోహ్లీ.. అసలు ఏం జరిగిందంటే..

భారత క్రికెట్‌లో గొప్ప ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లీ(Virat Kohli) అత్యంత ఫిట్‌గా ఉండే ఆటగాడిగా గుర్తింపు పొందాడు. కోహ్లీ ప్రత్యేకమైన డైట్‌ కూడా అనుసరిస్తాడు అందుకే అతడు ఫిట్‌గా ఉంటాడు.

Virat Kohli: మటన్ రోల్‌ కోసం ప్రాణాల్ని ఫణంగా పెట్టిన విరాట్‌ కోహ్లీ.. అసలు ఏం జరిగిందంటే..
Virat Kohli
Srinivas Chekkilla
|

Updated on: Mar 08, 2022 | 3:31 PM

Share

భారత క్రికెట్‌లో గొప్ప ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లీ(Virat Kohli) అత్యంత ఫిట్‌గా ఉండే ఆటగాడిగా గుర్తింపు పొందాడు. కోహ్లీ ప్రత్యేకమైన డైట్‌ అనుసరిస్తాడు అందుకే అతడు ఫిట్‌గా ఉంటాడు. అయితే జూనియర్ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు విరాట్ కోహ్లి చాలా లావు ఉండేవాడు. అప్పట్లో విరాట్ కోహ్లికి మసాలాలు పదార్థాలు తినడమంటే చాలా ఇష్టం. ఏ ఊరికి వెళ్లినా, విదేశాలకు వెళ్లినా అక్కడ ఫాస్ట్ ఫుడ్ తినేవాడు. ఓసారి మటన్ రోల్ కోసం విరాట్ కోహ్లీ తన ప్రాణాలను పణంగా పెట్టాడటా.. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ సహచర క్రికెటర్ ప్రదీప్ సాంగ్వాన్(Pradeep Sangwan) తెలిపాడు. అండర్-19 రోజుల్లో కోహ్లీ చాలా ప్రమాదకరమైన ప్రదేశాల్లో మటన్ రోల్స్(mutton rolls) తినేవాడని చెప్పాడు. అప్పట్లో గుర్తు తెలియని వ్యక్తులు కోహ్లీని వెంబడించారని ప్రదీప్ సాంగ్వాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

‘జూనియర్ క్రికెట్‌లో కోహ్లీ 7-8 సంవత్సరాలు నా సహచరుడు విరాట్ కోహ్లీ ఆహారాన్ని ఇష్టపడేవాడు. ముఖ్యంగా వీధి ఆహారం. అతనికి కోర్మా రోల్, చికెన్ రోల్ అంటే చాలా ఇష్టం. ఒకసారి మేము అండర్-19 జట్టుతో దక్షిణాఫ్రికాలో ఉన్నాము. ఒక చోట మటన్ రోల్ చాలా బాగుంటుందని, అయితే ఆ ప్లేస్ సేఫ్ కాదని ఎవరో విరాట్‌కి చెప్పారు. టీమ్‌లోని డ్రైవర్‌ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు.. అక్కడ ఫుడ్‌ బాగుంటుంది కానీ ఆ ప్లేస్‌ సేఫ్‌ కాదు. ఇటీవల అక్కడ ఓ వ్యక్తి చేయి తెగిపోయిందని చెప్పాడు.’ అని సాంగ్వాన్‌ అన్నాడు.

రిస్క్ తీసుకున్న విరాట్ కోహ్లీ ప్రమాదకరమైన ప్రదేశం అయినప్పటికీ విరాట్ కోహ్లీ అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడని ప్రదీప్ సాంగ్వాన్ చెప్పాడు. ప్రదీప్ సాంగ్వాన్‌ను ఒప్పించి అక్కడికి వెళ్లి మటన్ రోల్స్ తిన్నాడు. ‘డ్రైవర్ మాట విన్న తర్వాత నేను భయపడ్డాను, కానీ విరాట్ – అక్కడికి వెళ్దాం అని చెప్పాడు, అతను నన్ను కూడా అక్కడికి తీసుకెళ్లాడు. మేము మటన్ రోల్స్ తిన్నాము.. అయితే కొంతమంది తెలియని వ్యక్తులు మమ్మల్ని అనుసరించారు. వెంటనే మేము మా కారులో హోటల్‌కు తిరిగి వచ్చాం. అని వివరించాడు.

2012లో విరాట్ కోహ్లీ పూర్తిగా మారిపోయాడని ప్రదీప్ సాంగ్వాన్ గుర్తు చేసుకున్నాడు. అతను తన ఆహారాన్ని మార్చుకున్నాడని చెప్పాడు. ‘విరాట్ 2012లో భారత్‌కు అరంగేట్రం చేసిన తర్వాత మా వద్దకు వచ్చాడు. అతను తన ఆహారాన్ని వేరే స్థాయికి తీసుకెళ్లాడు. కానీ 2012లో డైట్, ఫిట్‌నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాడు. బరువు తగ్గాలనుకున్నాడు. అతను మంచి ఫీల్డర్‌గా ఉండాలనుకున్నాడు. అతను మంచి ఫీల్డర్ అయినప్పటికీ అత్యుత్తమ ఫీల్డర్ కావాలనుకున్నాడు. విరాట్ కోహ్లీ నెట్స్‌లో గంటల తరబడి బ్యాటింగ్ చేసేవాడు మరియు పూర్తయిన తర్వాత అతను నాకింగ్ కూడా చేసేవాడు.

Read Also.. Indian Cricket Team: సాధారణ ఆటగాడి నుంచి ప్రపంచ స్థాయి క్రికెటర్‌గా మార్పు.. తగ్గేదేలే అంటోన్న టీమిండియా ఆల్‌ రౌండర్..