AUS vs PAK: ఆసీస్ దెబ్బకు పాక్ విలవిల.. వరుసగా రెండో ఓటమి.. ప్రపంచకప్‌లో సంక్షిష్టంగా మారిన అవకాశాలు

టోర్నీ రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందు పాకిస్థాన్ 191 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ జట్టుకు ఇది రెండో అతిపెద్ద స్కోరు. అయినప్పటికీ ఆ టీం డిఫెండ్ చేయడంలో విఫలమైంది.

AUS vs PAK: ఆసీస్ దెబ్బకు పాక్ విలవిల.. వరుసగా రెండో ఓటమి.. ప్రపంచకప్‌లో సంక్షిష్టంగా మారిన అవకాశాలు
Icc Women’s World Cup 2022 Pakistan Vs Australia
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Mar 08, 2022 | 2:58 PM

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022(ICC Women’s World Cup 2022) లో పాకిస్థాన్ కష్టాలు పెరిగాయి. ఎందుకంటే భారత్ తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా (Australia Women)పై కూడా ఓటమి చవిచూసింది. ఇలా వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో టోర్నీలో ముందుకు వెళ్లేందుకు అడ్డంకిగా మారింది. టోర్నీ రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందు పాకిస్థాన్ 191 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ జట్టుకు ఇది రెండో అతిపెద్ద స్కోరు. అయినప్పటికీ వారు డిఫెండ్ చేయడంలో విఫలమయ్యారు. అలిస్సా హీలీ(Alyssa Healy) అద్భుత బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్లు కోల్పోయి పాకిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించింది.

తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 12 పరుగుల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా, పాక్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. అదే సమయంలో భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ 107 పరుగుల తేడాతో ఓడిపోయింది.

పాకిస్థాన్‌ను షేక్ చేసిన హిల్లీ! పాకిస్థాన్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. అయితే ఇంగ్లండ్‌పై పటిష్ట ఇన్నింగ్స్ ఆడిన రాచెల్ హన్స్ పాకిస్థాన్‌పై 34 పరుగులు చేసి ఔటైంది. కానీ, అలిస్సా హీలీ మరో ఎండ్‌లో రాచెల్ హాన్స్‌తో కలిసి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించింది. ఆ తర్వాత రెండో వికెట్‌కు కెప్టెన్ మెగ్ లానింగ్‌తో కలిసి మరో అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. 35 పరుగుల వద్ద లానింగ్ ఔటయింది. అదే సమయంలో అలిస్సా హీలీ అర్ధ సెంచరీ పూర్తి చేసింది.

అలిస్సా హీలీ 79 బంతుల్లో 72 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైంది. ఆమె ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు ఉన్నాయి. దీని తర్వాత పెర్రీ, మూనీ కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. పెర్రీ 26 పరుగులతో నాటౌట్‌గా ఉండగా, మూనీ 23 పరుగులు చేసింది.

Also Read: Indian Cricket Team: సాధారణ ఆటగాడి నుంచి ప్రపంచ స్థాయి క్రికెటర్‌గా మార్పు.. తగ్గేదేలే అంటోన్న టీమిండియా ఆల్‌ రౌండర్..

ICC Women World Cup 2022: 25 ఏళ్లనాటి రికార్డు బద్దలు.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న జోడీ..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే