AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli – Kane Williamson: అందుకే విరాట్ కోహ్లీని కౌగిలించుకున్న..! విలియమ్సన్‌

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియాపై న్యూజిలాండ్ విజయం సాధించి ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. విన్నింగ్ షాట్‌ కొట్టిన రాస్‌టేలర్‌ను అభినందించిన కివీస్ కెప్టెన్ నేరుగా కోహ్లీ వద్దకు వచ్చి కౌగిలించుకున్నాడు.

Virat Kohli - Kane Williamson: అందుకే విరాట్ కోహ్లీని కౌగిలించుకున్న..! విలియమ్సన్‌
Virat Kohli And Kane Williamson
Venkata Chari
|

Updated on: Jun 29, 2021 | 11:47 AM

Share

Virat Kohli – Kane Williamson: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియాపై న్యూజిలాండ్ విజయం సాధించి ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. కేన్‌ సేన 8 వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో విన్నింగ్ షాట్‌ కొట్టిన రాస్‌టేలర్‌ను అభినందించిన కివీస్ కెప్టెన్ నేరుగా కోహ్లీ వద్దకు వచ్చి కౌగిలించుకున్నాడు. అలానే కొద్దిసేపు భుజంపై తలను ఆనించి ఉంచాడు. అయితే నెట్టింట్లో అదో పెద్ద సంచలనంలా మారిపోయింది. తాజాగా దీనిపై కివీస్ కెప్టెన్ విలియమ్సన్‌ స్పందించాడు. టీమిండియా సారథి, నేను మంచి మిత్రులమేనని, చాలా ఏండ్లుగా మాస్నేహం కొనసాగుతుందని వెల్లడించాడు. బరిలో ప్రత్యర్థులమే కావొచ్చు.. మ్యాచ్‌ అనంతరం స్నేహితులమని, అంతర్జాతీయ క్రికెట్‌లో ఫ్రెండ్‌ షిప్‌లు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నాడు.

‘నేను, భారత సారథి చాలాకాలంగా స్నేహితులుగా కొనసాగుతున్నాం. మేమిద్దరం సహచరులం కూడా. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని కలిసే అవకాశం క్రీడల వల్ల దొరుకుతుంది. అలాగే కొంతమంది స్నేహితులు కూడా లభిస్తారు. ఒకే మ్యాచ్‌లో ఆడుతున్నా.. ప్రత్యర్థులగా బరిలోకి దిగినా సరే భిన్నమైన అనుభవాలు ఎదురవుతాయి. ఒక్కోసారి ఇష్టాయిష్టాలు కూడా కలుస్తాయి’ అని కివీస్ కెప్టెన్ తెలిపాడు. ఒక మ్యాచులో ఓడిపోవచ్చు, కానీ, టీమిండియాను తక్కువ అంచనా వేయొద్దని.. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీసేన బలమైన జట్టని పేర్కొన్నాడు.

అండర్-19 నుంచి కోహ్లీ, విరాట్ మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. అలాగే జాతీయ జట్టులోకి ఎంపికైన తరువాత ఇద్దరూ కీలక ఆటగాళ్లుగా మారి, సారథులుగా టీం ను ముందుడి నడిపిస్తున్నారు. తమ హయాంలో దేశానికి ఒక్క ఐసీసీ ట్రోఫీనైనా అందించాలని ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్లుగా ఎదిగారు. కానీ, ఐసీసీ టోర్నీల్లో మాత్రం బోల్తాపడుతున్నారు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో కోహ్లీసేన ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. అలాగే 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో కివీస్ పై ఓడిపోయింది. మరోవైపు న్యూజిలాండ్ టీం సైతం 2015, 2019 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఓడిపోయారు. దీంతో అరంగేట్ర ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీని సాధించాలని బరిలోకి దిగారు. కివీస్ టీం విశ్వ విజేతగా నిలిచి, తన కల నెరవేర్చుకుంది. దీంతో కేన్ విలియమ్సన్‌..కోహ్లీని వద్దకు వచ్చి గట్టిగా హత్తుకుని భుజంపై వాలిపోయాడు.

Also Read:

Wimbledon 2021 Day 1 Highlights: గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్‌కు ఊహించని ఫలితం; జకోవిచ్, సబలెంక శుభారంభం!

UEFA EURO 2020: పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌కి షాక్; క్వార్టర్ ఫైనల్‌లోకి స్విట్జర్లాండ్

ENG vs SL: ముగ్గురు లంక ఆటగాళ్లపై నిషేధం; ఇంగ్లండ్‌ తో వన్డేలకు దూరం!