UEFA EURO 2020: పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌కి షాక్; క్వార్టర్ ఫైనల్‌లోకి స్విట్జర్లాండ్

ఎలాంటి అంచనాలు లేకుండా యూరోకప్ బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ టీం.. ప్రపంచ ఛాంపియన్లకు షాకిస్తూ ముందుకుసాగుతోంది. ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధిస్తూ.. ఏకంగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుని ఆశ్చర్యపరించింది.

UEFA EURO 2020: పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌కి షాక్; క్వార్టర్ ఫైనల్‌లోకి స్విట్జర్లాండ్
Uefa Euro 2020 Switzerland Vs France
Follow us
Venkata Chari

|

Updated on: Jun 29, 2021 | 7:01 AM

UEFA EURO 2020: ఎలాంటి అంచనాలు లేకుండా యూరోకప్ బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ టీం.. ప్రపంచ ఛాంపియన్లకు షాకిస్తూ ముందుకుసాగుతోంది. ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధిస్తూ.. ఏకంగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుని ఆశ్చర్యపరించింది. ప్రపంచ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌తో సోమవారం ప్రీ క్వార్టర్స్‌లో తలపడిన స్విట్జర్లాండ్.. పెనాల్టీ షూటౌట్ లో 5-4 తేడాతో ఫ్రాన్స్‌ను బోల్తాకొట్టించింది. చివరి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ టీంలు 3-3 గోల్స్‌తో సమంగా నిలిచాయి. దీంతో ఎక్స్‌ట్రా టైం లో మరోసారి తలపడ్డాయి. అయితే, అక్కడ కూడా ఫలితం తేలలేదు. కారణం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ టీంలు నిర్ణీత సమయంలో గోల్స్ సాధించలేకపోయాయి. దీంతో మ్యాచ్‌ ఫెనాల్టీ షూటౌట్‌ కు చేరింది. ఈ సారీ మాత్రం ఫ్రాన్స్ అవకాశాలను జారవిడుచుకోవడంతో స్విట్జర్లాండ్ విజేతగా నిలిచింది. 5 పెనాల్టీ కిక్‌లను గోల్‌గా మార్చి స్విట్జర్లాండ్‌ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. ఫ్రాన్స్‌ కేవలం 4 గోల్స్‌ చేసి చివరి అవకాశాన్ని మాత్రం కాపాడుకోలేకపోయింది. ఫ్రాన్స్‌ ఆటగాడు ఎంబపె పెనాల్టీ కిక్‌ను గోల్ చేయనియకుండా స్విట్జర్లాండ్‌ గోల్‌కీపర్‌ యాన్‌ సోమర్‌ అడ్డుకోవడంతో స్విట్జర్లాండ్‌ క్వార్టర్‌ ఫైనల్‌కి అడుగుపెట్టింది. స్విట్జర్లాండ్ టీం తన తదుపరి మ్యాచ్‌లో స్పెయిన్‌తో తలపడనుంది.

ఆద్యాంతం రక్తి కట్టించిన ఈ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌.. మ్యాచ్‌ 15వ నిమిషంలో గోల్‌ చేయడంతో 1-0 ఆధిక్యంలోకి చేరుకుంది. అయితే ఫ్రాన్స్ వరుసగా 57, 58 నిమిషాల్లో గోల్స్‌ చేసి 1-2 తేడాతో లీడ్‌ సాధించింది. అనంతంర మ్యాచ్ 75వ నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాడు పొగ్బా గోల్‌ సాధించడంతో.. 1-3తేడాతో ఆధిపత్యంలోకి చేరుకుంది. దీంతో ఇక విజయం ఫ్రాన్స్ దే అనుకున్నారంతా.. కానీ, అందరికీ షాక్ ఇస్తూ… స్విట్జర్లాండ్ 81 నిమిషంలో గోల్‌చేసి ఫ్రాన్స్‌ ఆధిక్యాన్ని 2-3కు తగ్గించింది. అలాగే 90వ నిమిషంలో మరో గోలో సాధించి మ్యాచ్‌ ను 3-3తో సమం చేసింది. దీంతో షూటౌట్‌ లో విజేతను తేల్చుకోవాల్సి వచ్చింది.

పెనాల్టీ షూటౌట్‌లో తలపడిన తీరు..

స్విట్జర్లాండ్ 1-0 ఫ్రాన్స్: స్విట్జర్లాండ్ ఆటగాడు మారియో గావ్రనోవిక్ గోల్!

స్విట్జర్లాండ్ 1-1 ఫ్రాన్స్: ఫ్రాన్స్ ఆటగాడు పాల్ పోగ్బా గోల్!

స్విట్జర్లాండ్ 2-1 ఫ్రాన్స్: స్విట్జర్లాండ్ ఆటగాడు ఫాబియన్ షార్ గోల్!

స్విట్జర్లాండ్ 2-2 ఫ్రాన్స్: ఫ్రాన్స్ ఆటగాడు ఆలివర్ గిరౌడ్ గోల్!

స్విట్జర్లాండ్ 3-2 ఫ్రాన్స్: స్విట్జర్లాండ్ ఆటగాడు మాన్యువల్ అకాంజి గోల్!

స్విట్జర్లాండ్ 3-3 ఫ్రాన్స్: ఫ్రాన్స్ ఆటగాడు మార్కస్ థురామ్ గోల్!

స్విట్జర్లాండ్ 4-3 ఫ్రాన్స్: స్విట్జర్లాండ్ ఆటగాడు రూబెన్ వర్గాస్ గోల్!

స్విట్జర్లాండ్ 4-4 ఫ్రాన్స్: ఫ్రాన్స్ ఆటగాడు ప్రెస్నెల్ కింపెంబే గోల్!

స్విట్జర్లాండ్ 5-4 ఫ్రాన్స్: స్విట్జర్లాండ్ ఆటగాడు అడ్మిర్ మెహమెడి గోల్!

స్విట్జర్లాండ్ 5-4 ఫ్రాన్స్: ఫ్రాన్స్ ఆటగాడు కైలియన్ ఎంబప్పే గోల్ చేయలేకపోవండతో స్విట్జర్లాండ్ విజయం సాధించింది.

Also Read:

ENG vs SL: ముగ్గురు లంక ఆటగాళ్లపై నిషేధం; ఇంగ్లండ్‌ తో వన్డేలకు దూరం!

Mithali Raj: అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ రాజ్ 22 ఏళ్లు పూర్తి; టెండూల్కర్ రికార్డుకు ఎసరు?

T20 World Cup: టీ20 ప్రపంచకప్ వేదిక మార్పు.. స్పష్టం చేసిన బీసీసీఐ..

IND vs SL: శిఖర్ ధావన్ సారథ్యంలో శ్రీలంక బయలుదేరిన టీమిండియా

IND vs SL: “ఇక్కడ రాణిస్తే.. పొట్టి ప్రపంచ కప్‌లో ఆడే ఛాన్స్ రావొచ్చు”; యంగ్ ప్లేయర్లతో టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్