Mithali Raj: అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ రాజ్ 22 ఏళ్లు పూర్తి; టెండూల్కర్ రికార్డుకు ఎసరు?

భాతర మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ లో 22 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. ఈమేరకు మిథాలీ ఓ రికార్డును బ్రేక్ చేయనుంది.

Mithali Raj: అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ రాజ్  22 ఏళ్లు పూర్తి; టెండూల్కర్ రికార్డుకు ఎసరు?
Mithali Raj
Follow us

|

Updated on: Jun 28, 2021 | 5:18 PM

Mithali Raj: భాతర మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ లో 22 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు. ఈమేరకు మిథాలీ ఓ రికార్డును బ్రేక్ చేయనుంది. సచిన్ టెండూల్కర్ తరువాత ఎక్కువ కాలం క్రికెట్ ఆడిన రికార్డును క్రియోట్ చేసింది. ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి మిథాలీ రాజ్ 1999 లో అరంగేట్రం చేసింది. అదే సంవత్సరం జూన్ 26న ఐర్లాండ్ తో జరిగిన వన్డేతో ఎంట్రీ ఇచ్చింది. టెస్టుల్లో 2002 వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచుతో 22 ఏళ్లు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డును సాధించింది. మరో కొద్ది రోజుల్లో సచిన్‌ రికార్డునూ బ్రేక్ చేసేందుకు సిద్ధమైంది. సచిన్ టెండూల్కర్ క్రికెట్ లో 22 సంవత్సరాల 91 రోజులు కొనసాగాడు. దీంతో మరో మూడు నెలల్లో మిథాలీ.. సచిన్ రికార్డును బ్రేక్ చేయనుంది.

ప్రస్తుతం మిథాలీ టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టెస్టు, వన్డే క్రికెట్‌ లో మాత్రమే కొనసాగుతోంది. 2022లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌ సాధించి ఆటలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆమె కెప్టెన్సీలో రెండు సార్లు ఫైనల్ చేరిన భారత మహిళలు..  కప్ ను మాత్రం సాధించలేక పోయింది. దీంతో కెరీర్ చివర్లో ఉన్న తను వరల్డ్ కప్ సాధించేందుకు ఆరాటపడుతోంది.

మహిళల క్రికెట్లో 215 వన్డేలు ఆడిన మిథాలీ, 7170 పరుగులు సాధించింది. ఇందులో 125* అత్యధిక స్కోర్ సాధించింది. అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్‌ గా నిలిచింది. అలాగే ఇప్పటి వరకు 11 టెస్టులు ఆడిన మిథాలీ 669 పరుగులు సాధించింది. ఇందులో 214 అత్యధిక స్కోర్ సాధించింది. అలాగే 89 టీ20లు ఆడి, 2,364 పరుగులు సాధించింది. ఇందులో 97* నాటౌట్ తో అత్యధిక స్కోర్ సాధించింది. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ మహిళలు.. ఏకైక టెస్టును డ్రా చేశారు. కానీ, తొలి వన్డేలో మాత్రం ఘోర పరాజయం పాలయ్యారు. కెప్టెన్ మిథాలీ రాజ్ మాత్రం 77 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. మిగతా బ్యాట్స్ ఉమెన్స్ త్వరగా పెవిలియన్ చేరడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ అలవోకగా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజలో ఉంది.

Also Read:

T20 World Cup: టీ20 ప్రపంచకప్ వేదిక మార్పు.. స్పష్టం చేసిన బీసీసీఐ..

IND vs SL: శిఖర్ ధావన్ సారథ్యంలో శ్రీలంక బయలుదేరిన టీమిండియా

IND vs SL: “ఇక్కడ రాణిస్తే.. పొట్టి ప్రపంచ కప్‌లో ఆడే ఛాన్స్ రావొచ్చు”; యంగ్ ప్లేయర్లతో టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్