ENG vs SL: ముగ్గురు లంక ఆటగాళ్లపై నిషేధం; ఇంగ్లండ్ తో వన్డేలకు దూరం!
ప్రస్తుతం శ్రీలంక జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. అయితే, ఈపర్యటనలో ఏదీ శ్రీలంకకు కలిసిరావడం లేదు. ఓ పక్క ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో ఓడిపోయిన ఆ జట్టుకు.. మరో షాక్ తగిలింది.
ENG vs SL: ప్రస్తుతం శ్రీలంక జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. అయితే, ఈపర్యటనలో ఏదీ శ్రీలంకకు కలిసిరావడం లేదు. ఓ పక్క ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో ఓడిపోయిన ఆ జట్టుకు.. మరో షాక్ తగిలింది. ముగ్గురు ఆటగాళ్లపై లంక బోర్డు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వరుస ఓటములతో కూరుకపోయిన లంక జట్టు.. నేటి నుంచి మొదలు కానున్న మూడు వన్డేల సిరీస్‌లో ఎలా ఆడనుందోనని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి శ్రీలంక ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌తో మూడో టీ20లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అయ్యాక ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లు కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషన్ డిక్‌విల్లా, ఓపెనర్ దనుష్క గుణతిలక బయోబబుల్ దాటి బయటకు వెళ్లారు. స్థానిక వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించారు. సోషల్ మీడియా ద్వారా విషయం బయటకు రావడంతో.. శ్రీలంక బోర్డు ఈ ముగ్గురి ఆటగాళ్లపై వన్డేలు ఆడకుండా నిషేధం విధించింది. అలాగే విచారణకు ఆదేశిస్తూ.. స్వదేశం చేరుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే శ్రీలంక పరిస్థితిపై ఆదేశ మాజీలు విమర్శలు వ్యక్తం చేస్తుండగా, ఆటగాళ్లు రూల్స పాటించకపోవడంతో మరింత ఫైర్ అవుతున్నారు. కోవిడ్-19 నిబంధనలు పాటించకుండా బుడగను దాటి వీధుల్లో తిరగడమేంటంటూ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ నిర్వహించడం ఆయా బోర్డులకు కూడా పెద్ద సమస్యగా మారింది. సిరీస్‌లు మొదలుకావడానికి కనీసం మూడు నుంచి నాలుగు వారాల ముందే ఆటగాళ్లను బయోబుగడలోకి పంపాల్సి వస్తోంది. అక్కడి నుంచి ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన ఆటగాళ్లు.. కొన్నిసార్లు ఇలా రూల్స్‌ని బ్రేక్ చేస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో పలువురు పాక్ క్రికెటర్లు కూడా బయోబుడగ దాటి రూల్స్ అతిక్రమించిన సంగతి తెలిసిందే.
నేటినుంచి ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను కోల్పోయిన శ్రీలంక తిరిగి పుంజుకుంటుందో.. వరుస షాక్‌లతో మరింతగా ఢీలా పడిపోతుందో చూడాలి. లంక జట్టుకు వరుసగా ఐదో టీ20 సిరీస్‌లను ఓడిపోయింది. త్వరలో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. లంక జట్టు తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే కఠిన చర్యలు తీసుకొని, టీంను కాపాడాలని కోరిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, శ్రీలంక తో టీమిండియా వచ్చే నెల నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనుంది. ఈమేరకు శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా జట్టు 22 మంది సభ్యులతో కలిసి శ్రీలంక పర్యటనకు బయలుదేరి వెళ్లింది. జులై 13 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. మరి శ్రీలంక టీం స్వదేశంలో ఎలా ఆడుతుందో చూడాలి.
Familiar faces in Durham tonight, enjoying their tour! Obviously not here to play cricket, this video was taken at 23.28 Sunday. Disappointing performance by these cricket players but not forgetting to enjoy their night at Durham. RIP #SrilankaCricket #KusalMendis #ENGvSL pic.twitter.com/eR15CWHMQx
— Nazeer Nisthar (@NazeerNisthar) June 28, 2021
Also Read:
Mithali Raj: అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ రాజ్ 22 ఏళ్లు పూర్తి; టెండూల్కర్ రికార్డుకు ఎసరు?
T20 World Cup: టీ20 ప్రపంచకప్ వేదిక మార్పు.. స్పష్టం చేసిన బీసీసీఐ..
IND vs SL: శిఖర్ ధావన్ సారథ్యంలో శ్రీలంక బయలుదేరిన టీమిండియా