AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డివిలియర్స్‌లాగే సుడిగాలి ఇన్నింగ్స్.. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో సూపర్ ఫాస్ట్ సెంచరీ బాదేశాడు..

ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే. అందులో ఏముందని అనుకుంటున్నారా.! అసలు సరదా ఏంటంటే.! అతడి బ్యాటింగ్..

డివిలియర్స్‌లాగే సుడిగాలి ఇన్నింగ్స్.. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో సూపర్ ఫాస్ట్ సెంచరీ బాదేశాడు..
Banton
Ravi Kiran
|

Updated on: Jun 29, 2021 | 4:24 PM

Share

ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే. అందులో ఏముందని అనుకుంటున్నారా.! అసలు సరదా ఏంటంటే.! అతడి బ్యాటింగ్. ఓపెనర్‌గా క్రీజులోకి అడుగుపెట్టి బౌలర్లకు చుక్కలు చూపించాడు. తాజాగా జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో సుమారు 66 నిమిషాల పాటు ఆరుగురి బౌలర్లపై విరుచుపడ్డాడు ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్. అతనెవరో కాదు.! ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు టామ్ బంటన్. టీ20 బ్లాస్ట్‌లో సోమర్‌సెట్ తరపున ఆడుతున్న బంటన్ సూపర్ ఫాస్ట్ సెంచరీ కొట్టాడు.

కెంట్, సోమర్‌సెట్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో కెంట్ మొదట బ్యాటింగ్ దిగి నిర్ణీత ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 168 పరుగులు చేసింది. ఆ జట్టులో జాక్ క్రౌలీ(39) ఒక్కడే అత్యధిక స్కోరర్. ఇక లక్ష్యచేధనలో భాగంగా బ్యాటింగ్ ఆరంభించిన సోమర్‌సెట్‌కు టామ్ బంటన్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఒక్క వికెట్ కోల్పోకుండా టార్గెట్‌ను చేధించడంలో సహాయపడ్డాడు.

66 నిమిషాలు, 6 బౌలర్లు, ఒక బ్యాట్స్‌మెన్..

169 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఓపెనర్‌గా దిగిన 22 ఏళ్ల టామ్ బంటన్ చిన్న సైజు విధ్వంసం సృష్టించాడు. బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 209.80 స్ట్రైక్ రేట్‌తో.. మొత్తం 51 బంతుల్లో 107 పరుగులు కొట్టి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే బంటన్ ఇన్నింగ్స్ మధ్య ఆడిన 15 బంతుల్లో సుమారు 72 పరుగులు రాబట్టి చిన్న సైజ్ విధ్వంసాన్ని సృష్టించాడు. అటు మరో ఓపెనర్ డీన్ కాన్‌వే 51 పరుగులు చేసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంలో సహాయపడ్డాడు. సోమర్‌సెట్ కేవలం 15.4 ఓవర్లలోనే 169 పరుగులు టార్గెట్‌ను చేధించింది.

Also Read:

పాపం ఈ అక్క కష్టం ఎవరికీ రావొద్దు.. వీడియోను నవ్వకుండా చూడండి మీకోసమే.!

బర్త్‌డే పార్టీకి సింహం చీఫ్ గెస్ట్.. వైరల్‌గా మారిన వీడియో.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్!

రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్.. గింగిరాలు తిరిగిన ఆటో.. షాకింగ్ దృశ్యాలు వైరల్!

మందు బాటిళ్లపై మతిపోగొట్టే ఫోజు.. వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.!

తెలుగు వార్తలు లైవ్ ఇక్కడ చూడండి 

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..