IND vs PAK: జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి తల దించుకున్న కోహ్లీ.. ఇంతకీ ఏం ప్రశ్న అడిగాడో తెలుసా..?
IND vs PAK: విరాట్ కోహ్లి నాయకత్వంలో ఇండియా మొదటిసారి పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. దేశ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ కెప్టెన్ కూడా ఓడిపోలేదు.
IND vs PAK: విరాట్ కోహ్లి నాయకత్వంలో ఇండియా మొదటిసారి పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. దేశ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ కెప్టెన్ కూడా ఓడిపోలేదు. ఐసిసి టి 20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 దశలో మొదటి మ్యాచ్‌లోనే భారత్ ఓడిపోయింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌కు ముందు భారతదేశం, పాకిస్తాన్ జట్లు.. వన్డే, టి 20 ప్రపంచకప్‌లో మొత్తం12 సార్లు తలపడ్డాయి కానీ పాకిస్తాన్ గెలవలేకపోయింది. మొదటిసారిగా టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఖాతా తెరిచింది. ఈ ఓటమి ఖచ్చితంగా టీమిండియాను కుదిపేస్తుంది.
ఈ ఓటమి తరువాత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ విలేకరుల సమావేశానికి వెళ్లారు. అక్కడ ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కోపం తెచ్చుకున్నారు. ఈ జర్నలిస్ట్ జట్టు ఎంపిక గురించి కోహ్లీని ప్రశ్నించాడు. దీనిపై కోహ్లీ మొదట కోపం తెచ్చుకున్నారు. తర్వాత నవ్వుతూ.. తలపట్టుకున్నారు. వాస్తవానికి ఆ జర్నలిస్ట్ కోహ్లీని ప్లేయింగ్ -11లో రోహిత్ స్థానంలో ఇషాన్ కిషన్‌కు చోటు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాడు.. దీనిపై కోహ్లీ జర్నలిస్ట్‌పై విరుచుకుపడ్డారు.
ఆ జర్నలిస్ట్‌ను అవహేళనగా చూస్తూ “ఇది తెలివైన ధైర్యమైన ప్రశ్న, మీరు ఏమనుకుంటున్నారు సార్? నేను అత్యుత్తమంగా భావించిన జట్టుతో క్రికెట్ ఆడాను. టీ 20 అంతర్జాతీయ జట్టు నుంచి మీరు రోహిత్ శర్మను తొలగించగలరా..? గత మ్యాచ్‌ల్లో అతను ఎలా ఆడాడో మీకు తెలుసు కదా ” అని సమాధానమిచ్చారు.
కోహ్లీ తప్పును అంగీకరించారు.. ఓటమి తర్వాత పాకిస్థాన్‌పై ప్రశంసలు కురిపించిన కోహ్లీ.. టీమ్ ఇండియా తన వ్యూహాన్ని సరిగ్గా అమలు చేయలేకపోయిందని అన్నారు. “మేము కోరుకున్న విధంగా మా ప్రణాళికను అమలు చేయలేకపోయాం. కానీ అర్హులైన వారికి క్రెడిట్ ఇవ్వాలి. పాకిస్తాన్ మమ్మల్ని మ్యాచ్ నుంచి పూర్తిగా దూరం చేసింది. పాకిస్తాన్ అద్భుతమైన బౌలింగ్ కూడా పరుగులు చేయడానికి అవకాశం ఇవ్వలేదు” అన్నారు.