Ind Vs Pak: పాకిస్తాన్‎ జట్టుపై ప్రశంసలు కురిపించిన పాక్ ప్రధాని.. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు..

2021 టీ 20 వరల్డ్ కప్‎లో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్‎తో జరిగిన మ్యాచ్‎లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడా విజయం సాధించింది. షాహీన్ అఫ్రిది నేతృత్వంలోని బౌలర్లు భారత్‌ను 151/7కు పరిమితం చేయడంతో 152 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా పాకిస్థాన్‌ ఛేదించింది...

Ind Vs Pak: పాకిస్తాన్‎ జట్టుపై ప్రశంసలు కురిపించిన పాక్ ప్రధాని.. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు..
Pakistan PM Imran Khan
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 25, 2021 | 1:41 PM

2021 టీ 20 వరల్డ్ కప్‎లో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్‎తో జరిగిన మ్యాచ్‎లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడా విజయం సాధించింది. షాహీన్ అఫ్రిది నేతృత్వంలోని బౌలర్లు భారత్‌ను 151/7కు పరిమితం చేయడంతో 152 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా పాకిస్థాన్‌ ఛేదించింది. కెప్టెన్ బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. దీంతో భారత్, పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు బాబర్ అజామ్ టీంను అభినందించారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పాక్ ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. మాజీ పేస్ బౌలర్ వసీం అక్రమ్ పాక్ గెలుపుపై ఆనందం వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మ్యాచ్ ముగిసే సమయానికి భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను ఉద్దేశిస్తూ హర్బజన్ సలామ్ క్రికెట్‌లో “పాకిస్తాన్ భారతదేశంతో పోటీ పడటం కనిపించడం లేదు” అని ట్వీ్ట్ చేశాడు. షోయబ్ తరువాత ట్విట్టర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. “చివరకు పాకిస్తాన్ గెలిచింది. నేను భారత్ గురించి చెడుగా ఏమీ చెప్పను, మీరు బాగా ఆడారు. కానీ శక్తివంతమైన బాబర్ అజామ్, రిజ్వాన్‌ను ఓడించడానికి సరిపడలేదు. పాకిస్థాన్‌కు శుభాకాంక్షలు” అని ఆయన అన్నారు. హర్భజన్ కూడా పాకిస్తాన్ ఆటగాళ్ల ఆటతీరును మెచ్చుకున్నాడు. ఇండియా తిరిగి పుంజుకుంటుంది అని చెప్పాడు. భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ పాకిస్తాన్ తగిన చోట గెలిచిందన్నాడు.

ఈరోజు భారతదేశానికి కష్టమైన రోజు.. ఇండియా తిరిగి పుంజుకుంటారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను! పాకిస్తాన్‎కు అభినందనలు అంటూ భారత్ మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. వాస్తవానికి మనమందరం నిరాశకు గురయ్యాం కానీ మన ఆశలు ఉన్నత స్థితిలో ఉంచుకుందామని మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ట్వీట్ చేశారు.

భారత్, పాకిస్థాన్ రెండూ తమ తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడతాయి. పాకిస్తాన్ మంగళవారం న్యూజిలాండ్‌తో తలపడగా, భారత్ తన తదుపరి మ్యాచ్ ఆదివారం ఆడనుంది.

Read Also.. Ind Vs Pak: మ్యాచ్‎కు ముందు అంతా మనకే అనుకూలం.. కానీ ఆరోజు మనది కాదు..